Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీకి జూలై 2023లో ఎన్నికలు?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గత కొంతకాలంగా 2023 డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఇదే విషయాన్ని ప్రకటించారు.

 Telangana Assembly Elections In July Details, Bjp, Congress , K Chandrasekhar Ra-TeluguStop.com

 ఆయన కుమారుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు కూడా ముందస్తు ఎన్నికలకు వేళ్ళే ప్రసక్తే లేదని వెల్లడించారు.అయితే, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే స్పష్టమైన సూచన భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందినట్లు అర్థమవుతోంది.

“సాధరణంగా కేసీఆర్ బహిరంగంగా చెప్పేది చేయడని. తన ఆకస్మిక నిర్ణయాలతో ప్రత్యర్థి పార్టీలను ఆశ్చర్యపరిచేందుకు ఎత్తులు వేస్తుండని ‘ తాజాగా బీజేపీ నేత ఒకరు తెలిపారు.

ఈ విషయంపై ఇతర పార్టీలకు కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికలకు ముందుకెళ్తారని ప్రకటించి, అందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని కోరారు.

ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని అందరూ ఊహల్లో ఉన్నారని,

Telugu Bownpallyvinod, Congress, Ktr, Telangana-Political

అయితే నా అంచనా ప్రకారం ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు ఉంటాయని శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన అన్నారు.వినోద్‌కుమార్‌ కేసీఆర్‌కు రైట్‌ హ్యాండ్‌గా పరిగణించబడుతున్నందున, కేసీఆర్‌ మనసులో ఏముందో వినోద్‌కు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.కాబట్టి ఆయన వ్యాఖ్యలను  సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమే.

తెలంగాణ అసెంబ్లీకి జూలైలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఏప్రిల్ లేదా మేలో రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘానికి కేసీఆర్ సిఫార్సు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్ ఎన్నికలు వెళ్ళే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube