తెలంగాణ రాష్ట్రంలో వార్షిక పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలయ్యింది.ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు నవంబర్ 17వ తారీకు లోపు ఫీజు చెల్లించాలి.50 రూపాయల ఫైన్ తో డిసెంబర్ మొదటి తారీకు వరకు, ₹200 ఫైన్ తో డిసెంబర్ 11 వరకు, ₹500 ఫైన్ తో డిసెంబర్ 20 వరకు ఫీజు చెల్లించాలి.కాగా రెగ్యులర్ విద్యార్థులు ₹125, మూడు సబ్జెక్టులు ఇంకా అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారు ₹110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారు ₹125 చెల్లించాలి.
ఇదిలా ఉంటే గత వారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల కావడం జరిగింది.అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10వ తారీకు లోపు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ప్రకటించడం జరిగింది.ఏపీలో పదవ తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ పరిశీలిస్తే నవంబర్ 11వ తేదీ నుంచి 16వ తారీకు వరకు 50 రూపాయలు, 17వ తేదీ నుంచి 22 వరకు 200 రూపాయలు, 23వ తేదీ నుంచి 30వ తారీఖు వరకు 500 రూపాయలు ఫైన్ తో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు.ఇదే సమయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్ణీత సమయంలో ఫీజులు విద్యార్థులు చెల్లించే విధంగా వ్యవహరించాలని ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగింపు ఉండదని హెచ్చరిక చేయడం జరిగింది.