దేశ వ్యాప్తంగా కాంగ్రెస్( Congress ) పరిస్థితి మెరుగు పడుతోంది.గత 9 సంవత్సరాలుగా వరుస పరాజయాల కారణంగా ఢీలా పడ్డ కాంగ్రెస్ కు మొన్న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు చాలా పెద్ద బూస్ట్ అనడంలో సందేహం లేదు.
దేశ వ్యాప్తంగా కూడా ఆ రాష్ట్ర ఫలితాలను చూపించి కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అంతే కాకుండా ఇన్నాళ్లు కాంగ్రెస్ గురించి పట్టించుకోని కొన్ని పార్టీలు కూడా ఇప్పుడు మనసు మార్చుకున్నాయి.
కచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ని ప్రధాని గా కూడా ప్రకటించేందుకు కొన్ని ఇతర పార్టీ లు ఓకే చెబుతున్నాయి.ఇలాంటి సమయంలో తెలంగాణ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు గాను సంబరాలు చేసుకున్నారు.
కానీ ఆ తర్వాత పార్టీని బలోపేతం చేసేందుకు గాను చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అంటే మాత్రం సమాధానం లభించడం లేదు.

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.కానీ ఆయన ప్రయత్నాలు ఎక్కడికి అక్కడ అడ్డుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు.కలిసి కట్టుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరియు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది అంటూ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది.ఆ విషయం ను ఎక్కువ గా ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించాల్సి ఉంటుంది.
కానీ ఇప్పటి వరకు ఆ విషయమై ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అధినాయకత్వం పిలిచి క్లాస్ పీకినా బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.