ఫేస్బుక్ లో సంచలన విషయాలు బయటపెట్టిన తేజస్వి.! ఆ విషయం తెలుస్తే కౌశల్ ని మీరే కొడతారు!

బిగ్‌బాస్ హౌస్‌లో కీలకమైన ఎలిమినేషన్ రోజైన ఆదివారం ఆసక్తికరమైన పరిణామాలతోపాటు కొన్ని విషాదఛాయలు కనిపించాయి.చివరికి నెటిజెన్ల ఊహించినట్టుగానే తేజస్వి ఎలిమినేట్ అయ్యింది.

 Tejaswi Reveals Shocking Facts About Big Boss In Facebook-TeluguStop.com

తేజస్వి అవుట్ కావడంపై బుల్లితెర ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఆమె ఎక్స్‌పోజింగ్‌ను చూడలేకపోతున్నామని ఈ మధ్యకాలంలో గగ్గోలుపెట్టారు.

దాంతో సోష‌ల్ మీడియా ప‌వ‌ర్‌కి బిగ్‌బాస్ టీమ్ త‌ల ఒగ్గాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

తేజస్వి ఎలిమినేషన్ పై కొంతమంది ఆమెకి సపోర్ట్ ఇస్తూ ట్వీట్లు చేసారు.

ఒక గంట చెత్త ఎపిసోడ్‌తో ఓ అమ్మాయిపై అప్పుడే నిర్ణయానికి రావొద్దు.ఇలాంటి అంశాలే అమ్మాయికి మరింత బలాన్ని ఇస్తాయి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

తేజస్వికి అండగా నిలిచారు.

ఇది ఇలా ఉండగా…నిన్న ఫేస్బుక్ లో ఆన్లైన్ లో కి వచ్చిన ఆమె కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు.తనకు కౌశల్‌కు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేశారు.ఇంట్లో జరిగే విషయాలు బయట వ్యక్తులకు అసలే తెలియదు.చూపించే కొన్ని సన్నివేశాలను బేరీజు వేసుకొని తనపై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆమె సూచించారు.ఫేస్‌లైవ్ తేజస్వి మాట్లాడుతూ.

బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చి చూస్తే కౌశల్‌ను మీరే కొడుతారు.

అర్ధరాత్రి లేచి కౌశల్ భోజనం చేస్తుంటాడు.దాని వల్ల ఎవరికి తిండి సరిపోదు.

అతడు ప్రవర్తించే విధానం సరిగా ఉండదు.రోజంతా ఏమి చేస్తాడో మీకు తెలియదు.

ఓ గంట సేపు ఎపిసోడ్ చూసి నన్ను ద్వేషిస్తారా అని తేజస్వి అన్నారు.నేను చెప్పిన నెగిటివ్ మాటను మాత్రమే చూపించారు.

అసలు చూసిస్తే నా మీద ఇంత ద్వేషం ఉండేది కాదేమో.సామ్రాట్ మంచి వ్యక్తి.

అందుకే ఆయనకు చేరువయ్యాను.తనీష్ కూడా చాలా మంచివాడు అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube