టాలీవుడ్ ఇండస్ట్రీలో యోధుడు అంటే పవన్.. తేజ సజ్జా కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈతరం బెస్ట్ హీరోలలో తేజ సజ్జా( Teja Sajja ) ఒకరు.తేజ సజ్జా పరిమితంగా పారితోషికం తీసుకుంటూనే ఎంతోమంది నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నారు.

 Teja Sajja Comments About Pawan Kalyan Details, Teja Sajja, Pawan Kalya, Mirai M-TeluguStop.com

ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్( Mirai ) అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

మిరాయ్ తెలుగు గ్లింప్స్ కు దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం.

ఈ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ లో తేజ సజ్జా మాట్లాడుతూ టాలీవుడ్ లో యోధుడు అంటే పవన్ కళ్యాణే( Pawan Kalyan ) అని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అయింది.

సూపర్ యోధ( Super Yodha ) అనే టైటిల్ ఎవరికి సూట్ అవుతుందనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అని తేజ సజ్జా చెప్పుకొచ్చారు.ఓజీ మూవీ( OG Movie ) గ్లింప్స్ చూసిన తర్వాత ఆ సినిమాకు సూపర్ యోధ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని తేజ సజ్జా కామెంట్లు చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తేజ సజ్జా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పవన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించినా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమని సమాచారం అందుతోంది.

అయితే ఓజీ మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తలను నమ్మాల్సి ఉంటుంది.ఓజీ సినిమా ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube