టాలీవుడ్ ఇండస్ట్రీలో యోధుడు అంటే పవన్.. తేజ సజ్జా కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈతరం బెస్ట్ హీరోలలో తేజ సజ్జా( Teja Sajja ) ఒకరు.
తేజ సజ్జా పరిమితంగా పారితోషికం తీసుకుంటూనే ఎంతోమంది నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నారు.
ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్( Mirai ) అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.మిరాయ్ తెలుగు గ్లింప్స్ కు దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం.
ఈ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ లో తేజ సజ్జా మాట్లాడుతూ టాలీవుడ్ లో యోధుడు అంటే పవన్ కళ్యాణే( Pawan Kalyan ) అని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అయింది.
సూపర్ యోధ( Super Yodha ) అనే టైటిల్ ఎవరికి సూట్ అవుతుందనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అని తేజ సజ్జా చెప్పుకొచ్చారు.
ఓజీ మూవీ( OG Movie ) గ్లింప్స్ చూసిన తర్వాత ఆ సినిమాకు సూపర్ యోధ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని తేజ సజ్జా కామెంట్లు చేశారు.
"""/" /
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తేజ సజ్జా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించినా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమని సమాచారం అందుతోంది.
"""/" /
అయితే ఓజీ మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తలను నమ్మాల్సి ఉంటుంది.
ఓజీ సినిమా ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.
కజకిస్థాన్ విమానం క్రాష్ తర్వాత లోపల ఏం జరిగిందంటే? వీడియో వైరల్