ప్రశాంత్ వర్మ హను-మాన్ నుండి తేజ సజ్జా బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

కెరీర్ ప్రారంభం నుండే సబ్జెక్ట్‌ ల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హను-మాన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

 Teja Sajja Birthday Special Poster From Hanu Man Movie, Teja Sajja, Teja Sajja B-TeluguStop.com

పుట్టినరోజు స్పెషల్ గా.తేజ సజ్జా బ్రాండ్ న్యూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్ లో తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకుని, ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు.ప్రత్యేక శక్తులతో సూపర్‌హీరోగా కనిపించనున్న ఈ చిత్రంలో తేజ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించనున్నారు.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.బిగ్ స్టార్స్, టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్.దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నలుగురు ట్యాలెంటెడ్ సంగీత దర్శకులు – అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూస్తున్నారు.

తారాగణం:

తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ తదితరులు.

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, నిర్మాత: కె నిరంజన్ రెడ్డి, బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, సమర్పణ: శ్రీమతి చైతన్య, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే, డీవోపీ: దాశరధి శివేంద్ర, సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్, ఎడిటర్: ఎస్బీ రాజు తలారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, పీఆర్వో : వంశీ-శేఖర్, కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube