మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు గల కారణం నటన పై తనకున్న ఆసక్తి, గౌరవం అని చెప్పవచ్చు.సినిమాలలో నటించడం కోసం ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే స్వభావం చిరంజీవిగారికి ఉందని , చిరంజీవి గారు సినిమాల కోసం ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తాజాగా తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్న తేజ తెలియజేశారు.
తేజ బాలనటుడిగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి ప్రముఖ హీరోల సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి ప్రస్తుతం “జాంబిరెడ్డి“సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నటుడు తేజ తన చిన్నప్పటి అనుభవాలను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ముఖ్యంగా చిరంజీవిగారి హీరోగా తెరకెక్కిన పలు చిత్రాలలో నటించిన తేజ “చూడాలని ఉంది” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవికి , తేజమధ్య జరిగిన ఓ సన్నివేశం గురించి గుర్తు చేసుకున్నారు.

చూడాలని ఉంది సినిమా షూటింగ్ సమయంలో తన వయస్సు కేవలం మూడు సంవత్సరాలు.ఈ సినిమా షూటింగ్ తలకోనలో జరుగుతుంది.మా ఇద్దరి మధ్య ఓ సన్నివేశ చిత్రీకరణలో భాగంగా చిరంజీవిగారు కొలను లో నుంచి నన్ను అలా పైకి తీయాలి.అయితే ఈ షార్ట్ తీయడానికి ముందు రోజు వరకు చిరంజీవి గారు ఎంతో జ్వరంతో బాధపడే వారు.
చికిత్స చేయించుకొని మరి ఈ షూటింగ్ లో పాల్గొన్న చిరంజీవి గారు షాట్ రెడీ అనగానే వెళ్లి కొలనులో నిలుచున్నారు.నేను మాత్రం ఆ కొలనులో దిగినని మారం చేస్తున్నాను దాదాపు ఆ షాట్ తీయడానికి రెండు గంటలపాటు చిరంజీవిగారు కొలనులో నిలబడి ఉన్నారు.
ఈ విధంగా ఉండటం వల్ల మరుసటి రోజు ఆయనకు జ్వరం విపరీతంగా వచ్చింది అంటూ చిరంజీవి గారు సినిమా పట్ల చూపే అభిమానం, సహజ నటన పట్ల ఇచ్చే గౌరవం లాంటి ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నానని తాజాగా తేజ తెలియజేశారు.