బన్నికి కౌంటర్ కాదు.. అది నా ఫీలింగ్..!

మెగా మేనళ్లుడిగా జబర్దస్త్ ఫాంలో ఉన్న సాయి ధరం తేజ్ ఒక్క రోజు గ్యాప్ తో తన తిక్క చూపించడానికి రాబోతున్నాడు.

అయితే రీసెంట్ గా జరిగిన తిక్క ఆడియో వేడుకలో బన్ని చెప్పను బ్రదర్ కు తేజు ఇచ్చిన ఆపలేను బ్రదర్ కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.

అసలే సెలబ్రిటీలు ఏమాట జారితే దాన్ని రచ్చ చేద్దామనుకునే మీడియాకు తేజ్ చెప్పిన ఆపలేను బ్రదర్ చిచ్చు మెగా ఫ్యాన్స్ లో మళ్లీ నిప్పు రాజేసేలా చేస్తున్నారు.అయితే దీనికి తేజ్ మాత్రం అభిప్రాయాలు ఎవరివి వారికుంటాయని చెబుతూ తన మామయ్య అయిన పవన్ కళ్యాణ్ గురించి తాను మాట్లాడటం తనకు తప్పని అనిపించడం లేదని అన్నాడు.

తాను కూడా ఫ్యాన్స్ మధ్యలో ఉండి ఇప్పుడు హీరో అయ్యానంటూ.చిరంజీవి, కళ్యాణ్ మామయ్యలంటే అభిమానులలానే వారి సినిమాలకు తాను చొక్కాలు చించుకుని, పేపర్లు విసిరేసిన సందర్భాలు ఉన్నాయన్నారు.

బన్నికి కౌంటర్ ఇచ్చిన తేజ్ ఇప్పుడు దాన్ని సర్ధి చెప్పే విధంగా మాట్లాడుతున్నా ఫ్యాన్స్ మాత్రం మాట వినేట్టు లేరు.ఓ విధంగా చిరు, పవన్ ల మధ్య నడుస్తున్న ఈ ఫేవరిజం గొడవ ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితులు కనబడట్లేదు.

Advertisement

పైకి ఒకటిగా కనిపిస్తున్నా మెగా హీరోల్లోనే చిరు పక్క కొందరు, పవన్ వైపు మరికొందరు ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

కూతుళ్లను హీరోయిన్స్ ని చేసిన నిన్నటి తరం అందమైన హీరోయిన్స్
Advertisement

తాజా వార్తలు