ఆ 75 ఏళ్ల వృద్ధ మహిళ దగ్గర టీన్స్ కూడా పనికిరారు.. ఆమె సాధించిన ఘనత చూస్తే జేజేలు కొడతారు!

అవును.ఆ 75 ఏళ్ల వృద్ధ మహిళ దగ్గర టీన్స్ కూడా పనికిరారు.ఆమె సాధించిన ఘనత చూస్తే జేజేలు కొడతారు.ఆమె తన సైకిల్​పై ఏకాకిగా 10 వేల కిలోమీటర్లు ప్రయాణించి అందర్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు.పుణెకు చెందిన ఈ మహిళ 75 ఏళ్ల వయసులో కేవలం 16 రోజుల వ్యవధిలో పుణె నుంచి సుందర్‌బన్‌కు 2,100 కి.మీ. ప్రయాణించి యువతకు స్ఫూర్తిగా నిలవడం విశేషం.ఈ సందర్భంగా ఆమె యువతకి ఓ మెసేజ్ పంపిస్తోంది.“మీ స్కూటర్‌కు ఓ 2 రోజులు విరామం ఇచ్చి సైకిల్‌ తొక్కండి అంటూ సందేశమిస్తున్నారు నిరుపమా భావే.”

 Teens Didn't Even Work For That 75-year-old Woman 75 Years, Old Women, Viral Ne-TeluguStop.com

ఈమె భర్తతో పాటు స్థానిక వాడియా కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిచేవారు.ఆ సమయంలో భర్త స్నేహితుడు పుణెలోని ఔంధ్‌ నుంచి వాడియాలోని కళాశాలకు సైకిల్‌పై వచ్చేవారు.ఇలా అతను రోజు 14 నుంచి 16 కి.మీ.ప్రయాణించేవారట.ఇదంతా చూసిన నిరుపమా ఆయన నుంచి స్ఫూర్తి పొంది సైకిల్‌ ప్రయాణం చేశారట.అలా 54 ఏళ్ల వయసులో ఆమె తొలిసారిగా సైకిల్‌పై “వాఘా సరిహద్దు నుంచి ఆగ్రా”కు పయనించారట.

ఆ తరువాత ఏడాది భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతాకు, ఆ తర్వాత గోవా నుంచి కొచ్చి వరకు, చెన్నై నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌పై ప్రయాణించారు.

Telugu Kanya Kumari, Pune-General-Telugu

ఇక ఈ బామ్మ తన 70వ పుట్టినరోజు సందర్భంగా ‘పుణె నుంచి కన్యాకుమారి‘ వరకు కేవలం 16 రోజుల్లోనే సైకిల్‌పై వెళ్లడం ఆశ్చర్యకరం.ఇక ఆమె 72వ జన్మదినం పురస్కరించుకుని జమ్మూ-కశ్మీర్‌ వరకు పర్యటన చేసి… దాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు ఆమె మొత్తం 10,000 కి.మీ.పైనే ప్రయాణం చేశారట.ఇప్పుడు కూడా ఆమె పుణెలోని ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా సైకిల్‌నే ఉపయోగిస్తుందట.

ఇక సైకిల్ తొక్కడంతో వున్న వ్యాయామాల గురించి ఆమె యువతకి చెప్పే ప్రయత్నం చేస్తోంది.ఈ క్రమంలోనే ఆమె స్కూటర్ ని పక్కన పెట్టి సైకిల్ ని తొక్కుమంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube