మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 వేదికగా టెక్నో సంస్థ టెక్నో పొవా 6 ప్రో 5G స్మార్ట్ ఫోన్( Techno Pova 6 Pro ) ను ఆవిష్కరించింది.టెక్నో పొవా 5 ప్రో హ్యాండ్ సెట్ కు తర్వాత వెర్షన్ గా ఉంది.
ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో చూద్దాం.టెక్నో పొవా 6ప్రో 5G స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్, HiOS 14 OS పై పనిచేస్తుంది.డిస్ ప్లే 2160Hz PWM డిమ్మింగ్ తో ఉంటుంది.6nm మీడియా టెక్ డైమెన్సిటీ, 6080 SoC చిప్ సెట్, 12GB RAM+256GB స్టోరేజ్ తో ఉంటుంది.
6000mAh బ్యాటరీ సామర్థ్యం తో 70W ఫస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.108 ఎంపీ ప్రధాన కెమెరా, 32 ఎంపీ సెల్ఫి కెమెరా తో ఉంటుంది.ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను( Triple Cameras ) కలిగి ఉంటుంది.డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తో ఉంటుంది.ఈ ఫోన్ కామెట్ గ్రీన్, మేటిరియోరైట్ గ్రే కలర్ లలో ఉంటుంది.27342mm కూలింగ్ ఏరియా ను కలిగి ఉంటుంది.ఈ- స్పోర్ట్ ప్రో ఆపరేషన్ ఇంజిన్, 4D వైబ్రేషన్ తో వస్తుంది.
ఈ సౌండ్ సిస్టమ్ కలిగి ఉన్న తొలి టెక్నో ఫోన్ ఇదే.ఈ ఫోన్ LED ఫ్లాష్ లైట్ తో వస్తుంది.ఈ ఫోన్ ప్యానల్ లో డైనమిక్ మిని LED ని కలిగి ఉంటుంది.
కాల్స్,పవర్ స్టేటస్, గేమింగ్, మ్యూజిక్ వంటి సమయాల్లో కస్టమైజిడ్ గా వస్తుంది.ఈ ఫోన్ లాంచింగ్ తేదీ, ధర వివరాలు కంపెనీ ఇంకా ప్రకటించలేదు.