వయసును వెనక్కు నెడుతున్న విజ్ఞానం....ఇది సాధ్యమేనా?

మహాభారతం పై ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరికి తెలిసే కథ యయాతి కథ.మహర్షి శుక్రాచార్యుడు ( Shukracharya )శాపానికి గురయ్యి చిన్న వయసులోనే వృధాప్యం మీదపడితే, తన కొడుకులను తమ యవ్వనాన్ని తనకు ఇమ్మని ప్రాధేయపడతాడు యయాతి.

 Technology Makes People Young , Shukracharya, Yayati, Film Actress Rekha, Paris,-TeluguStop.com

కానీ ఎవ్వరు అంగీకరించారు.చివరికి అతని చిన్న కొడుకు అంగీకరించి ఇస్తాడు.

కొడుకు త్యాగంతో యయాతి ( Yayati )మళ్ళి తిరిగి తాను కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందుతాడు.ఐతే ఈ కథ ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు సాంకేతిక రంగంలో జరుగుతున్నా పురోగతి చూస్తుంటే ఈ కథ గుర్తుకువచ్చింది.అసలు విషయం ఏమిటంటే.

Telugu America, Brain Tree, Bryan Johnson, Actress Rekha, Paris, Shukracharya, Y

సినీ నటి రేఖ( Film actress Rekha ) పారిస్ వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వచ్చారట.ఆమె సర్జరీ చేయించుకున్నాక ఆమె వయసు పది సంవత్సరాలు తగ్గినట్టు కనిపిస్తోంది.రేఖ వయసు 68 ఏళ్ళు.

కానీ ఆమె చూస్తుంటే అప్పుడెప్పుడో ఆమె వయసు ఆగిపోయినట్టు అనిపిస్తోంది.దేవతలు సైతం ఈర్ష్యపడేలా ఉంది ఆమె అందం.68 ఏళ్ళ వయసు మీద పడిన, ఇంకా ఆమె మొహం మీద ముడతలు రానివ్వడంలేదు.అసలు ఈమె ఇలా ఇన్నేళ్ళపాటు తన అందాన్ని ఎలా కాపాడుకుందో తెలుసుకోవాలని ప్రతి భారత మహిళా మనసులో ఉంటుంది.

ఐతే ఇంతకీ రేఖ నిజంగానే సర్జరీ చేయించుకుందా? లేక అది ఆమెకు పుట్టుకతో వచ్చిన జెనెటిక్ క్వాలిటీ ఆ ? అనే సందేహం అందరిలోనూ ఉంది.

Telugu America, Brain Tree, Bryan Johnson, Actress Rekha, Paris, Shukracharya, Y

ఈ సందేహాల నడుమ మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అమెరికాలో( America ) ఒక మనిషి ప్రతి సంవత్సరం సుమారు 17 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడట.అంత ఖర్చు దేనికి అని ఆలోచిస్తున్నారా? వయసును వెనక్కి మళ్లించడం కోసం.ఈ అపార కుబేరుడు తన యవ్వనాన్ని కాపాడుకోవడం కోసం రోజుకి 111 మాత్రలు మింగుతున్నాడట.ఇలా యవ్వనం కోసం అలమటిస్తున్న కలియుగ యయాతి పేరు బ్రయాన్ జాన్సన్( Bryan Johnson ).ఈయన బ్రెయిన్ ట్రీ అనే కంపెనీ కి అధినేత.తన కంపెనీ ని 80 కోట్ల డాలర్లకు ఈ బే కు అమ్మేశాడు బ్రయాన్.

అంత డబ్బుతో ఏం చెయ్యాలో అర్ధం కాక ఇప్పుడు 18 ఏళ్ళ కుర్రాడిలా మారిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈయన కోసం “ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్” ( Project Blue Print )అనే ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది 30 మంది డాక్టర్లతో కూడిన ఒక బృందం.

బ్రయాన్ ప్రతిరోజు ఏం తినాలి, ఏ వ్యాయామాలు చెయ్యాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి….ఇలా అన్ని విషయాలు వారే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట.ఆశ్చర్యం ఏమిటంటే, వారి ప్రయోగాలు ఫలిస్తున్నాయి.ఒక్కవేల ఈ ప్రాజెక్ట్ సక్సెస్ ఐతే, మనిషి అమరుడైపోతాడేమో!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube