గోంగూర సాగులో చేపట్టాల్సిన మెళుకువలు..!

గోంగూర( Gongura )లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.అందుకే ఆకుకూరల్లో గోంగూర రారాజుగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

 Techniques To Be Taken In Gongura Cultivation , Gongura , Greens , Gongura Cult-TeluguStop.com

అందరూ గోంగూరను తినడానికి ఇష్టపడతారు కాబట్టి మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.పైగా ఇతర ఆకుకూరలతో పోలిస్తే గోంగూర అధిక లాభాలను ఇచ్చే పంట.గోంగూరను వేసవిలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు.

గోంగూర సాగుకు( Gongura Cultivation ) నీటి వసతి ఉండే ఎర్ర నేలలు, తేలిక రకపు నేలలతో పాటు, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 6 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు.

Telugu Agriculture, Chemical Spray, Gongura, Greens-Latest News - Telugu

ఒక ఎకరం పొలానికి ఆరు కిలోల గోంగూర విత్తనాలు( Borage seeds ) అవసరం.గోంగూరను విత్తిన నాలుగు రోజులకు నీటి తడిని అందించాలి.గోంగూర కోసిన ప్రతిసారి 10 కిలోల యూరియా వేసి నీటి తడి అందించాలి.

గోంగూర పంటపై అనవసర రసాయన పిచికారి మందులు( Chemical spray ) ఉపయోగించకుండా మొక్కలకు ఏవైనా తెగుళ్లు లేదా చీడపీడలు ( pests )ఆశిస్తే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి నాశనం చేయాలి.కేవలం తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే పురుగు మందులను( Pesticides ) వాడాలి.

Telugu Agriculture, Chemical Spray, Gongura, Greens-Latest News - Telugu

గోంగూర కు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే.పిండి నల్లి పురుగులు, పచ్చ పురుగులు, దీపపు పురుగులు పంటను ఆశిస్తే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.ఈ పురుగుల నివారణకు సేంద్రీయ పద్ధతిలో ఒక లీటరు నీటిలో ఐదు మిల్లీమీటర్ల వేప నూనెను కలిపి మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.గోంగూర కోతల విషయానికి వస్తే.విత్తిన 25 రోజులకు గోంగూర తలలను తుంచాలి.15 నుండి 20 రోజులకు ఒకసారి కొమ్మలను తుంచుతూ కోతలు కోయాలి.ఐదు కోతలు కోసుకున్న తర్వాత విత్తనం కోసం వదిలిపెట్టాలి.ఈ పద్ధతులను పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు అర్టించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube