ఉల్లిసాగు నారు మడి పెంపకంలో పాటించవలసిన మెళుకువలు..!

ఉల్లి పంటకు( Onion crop ) మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల చాలామంది రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.

కొంతమంది రైతులు సరైన అవగాహన లేకపోవడం వల్ల మంచి దిగుబడి సాధించలేక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఉల్లి సాగు చేయాలి అనుకునే రైతులు ముందుగా ఉల్లి సాగు నారుమడి పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.అప్పుడే ఆరోగ్యవంతమైన ఉల్లినారు ప్రధాన పొలంలో నాటుకొని మంచి దిగుబడి పొందవచ్చు.

ఉల్లిసాగు కు నీరు నిల్వ ఉండని సారవంతమైన మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి.నీరు ఇంకిపోయే తేలికపాటి నేలలలో అధిక దిగుబడి సాధించవచ్చు.

ఇక నీరు నిల్వ ఉండే నేలలు, ఉప్పు, చౌడు, క్షరత్వం కలిగిన నేలలు ఉల్లి సాగుకు పనికిరావు.

Advertisement

ఉల్లి సాగుకు ఖరీఫ్ సీజన్లో జూన్, జూలై నుండి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేయవచ్చు.రబీ సీజన్ అయితే నవంబర్ నుండి ఏప్రిల్ వరకు సాగు చేయవచ్చు.ఇక వేసవి కాలంగా అయితే జనవరి లేదా ఫిబ్రవరి నెలలో సాగు చేయవచ్చు.

ఉల్లి పంట వేయడానికి ముందు నారుమడులను ఏర్పాటు చేసుకొని ఉల్లినారు పెంచుకోవాలి.ఉల్లినారు పెంచడానికి రెండు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

ఒకటి చిన్నచిన్న మడులలో నాటుకునే పద్ధతి, రెండవది ఎత్తయిన బ్లేడ్లతో ఇరిగేషన్ ద్వారా సాగు చేసే పద్ధతి.

ఒక ఎకరానికి 3.5 ఉల్లి విత్తనాలు అవసరం.మార్కెట్లో దొరికే సర్టిఫైడ్ కంపెనీ విత్తనాలను ( Certified company seeds )మాత్రమే ఎంపిక చేసుకొని, కిలో విత్తనాలకు మూడు గ్రాముల ఆక్సి క్లోరైడ్ లేదా కాప్టాన్( Oxy chloride or captan ) కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ప్లాస్టిక్ వలలో చిక్కుకుని తాబేలు విలవిల.. రక్షించిన వ్యక్తి.. వీడియో వైరల్..

నారుమడులలో ఉల్లి విత్తనాలు విత్తిన తరువాత పది రోజులకు ఒకసారి ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ ను కలిపి పిచికారి చేస్తుండాలి.నారు పెరుగుదల దశలో కార్పో ప్యూరాన్ 3 జీ గుళికలు నారుమడిలో చల్లి నీరు పెడితే రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఉంటాయి.

Advertisement

ఇక ప్రధాన పొలంలో ఉల్లినారు నాటుకోవడానికి ముందు ఒక ఎకరాకు ప్లుక్లోరాలిన్ 45శాతం ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి నేల మొత్తాన్ని కలియదున్నిన తరువాత నాటుకోవాలి.

తాజా వార్తలు