తైవాన్ నిమ్మ సాగు( Taiwan lemon cultivation ) చేస్తే చీడపీడల, తెగుళ్ల బెడద చాలా తక్కువ కాబట్టి అనవసర రసాయన మందుల ఉపయోగం దాదాపుగా లేనట్టే.దీంతో పెట్టుబడి వ్యయం తక్కువ- రాబడి ఎక్కువగా ఉంటుంది.
పైగా తైవాన్ నిమ్మ పంట మొదటి ఏడాదికే కోతకు రావడం జరుగుతూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు.తైవాన్ నిమ్మ పంట ఏడాదిలో మూడు సార్లు కోతకు వస్తుంది.
మామూలు నిమ్మ చెట్లు అయితే ఏడు లేదా ఎనిమిది ఏళ్ల తర్వాత చనిపోతాయి.కానీ తైవాన్ నిమ్మ చెట్లు దాదాపుగా 20 ఏళ్ల పాటు కాపును ఇస్తాయి.
తైవాన్ నిమ్మ పంట సాగులో సేంద్రీయ ఎరువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.గొర్రెలు, మేకలు, కోళ్ల ఎరువు ( Sheep, goat, chicken manure )తెస్తే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది.ఒక ఎకరం పొలంలో సుమారుగా 300 వరకు తైవాన్ జాతి నిమ్మ మొక్కలు నాటుకోవచ్చు.ఒకటి నుంచి రెండు అడుగుల పొడవు ఉండే మొక్కను ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ముందుగా అడుగున్నర లోతు, అడుగున్నర వెడల్పు ఉండే గొయ్యి తవ్వి అందులో పశువుల ఎరువు, మేకల, గొర్రెల, కోళ్ల పెంట వేయాలి.మొక్కకు మొక్కకు మధ్య కనీసం నాలుగు మీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
తైవాన్ జాతి నిమ్మ మొక్కలకు రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందుల( Chemical fertilizers , chemical sprays ) అవసరం ఉండదు.ఎందుకంటే ఈ జాతి నిమ్మ చెట్లకు ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు ఆశించే అవకాశం లేదు.తైవాన్ జాతి నిమ్మ చెట్లకు కచ్చితంగా ప్రూనింగ్ చేయాలి.ఇలా చేస్తే చెట్టుకు చిగురు ఎక్కువగా వచ్చి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.తైవాన్ జాతి నిమ్మ మొక్కలు సాగు చేస్తే పెట్టుబడి వ్యయం చాలా తక్కువ.ఇక దిగుబడి ఆశించిన స్థాయిలో పొందవచ్చు.