ముల్లంగి సాగుకు ఎటువంటి వాతావరణం అయినా అనుకూలంగానే ఉంటుంది.ప్రధాన దుంప వేరు పంటలలో ముల్లంగి కూడా ఒకటి.
ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు A,C లాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి ముల్లంగిను సలాడ్ గా ఉపయోగిస్తారు.
అయితే ముల్లంగి సాగు( radish ) వేసే ముందు పొలాన్ని 20 సెంటీమీటర్ల లోతులో బాగా దున్నితే సూర్యరశ్మి కిరణాలు( Sun rays ) భూమిలోనికి పడడంతో లోపల ఉండే చీడపీడలకు తెగుళ్లను చాలావరకు అరికట్టవచ్చు.
ఓ రెండు వారాల తర్వాత నేలను చదువులు చేసి ఎకరాకు 10 టన్నుల మేర పశువుల ఎరువులు వేసి కలియదుండాలి.తర్వాత 20 కేజీల యూరియా, 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్పేట్, న్యూ ఇయర్ ఆఫ్ పొటాష్( New Year of Potash ) 35 కేజీలు కలిపి ఎరువుల రూపంలో భూమిలో చల్లాలి.ఇక ఎకరాకు నాలుగు కిలోల విత్తనాలు అవసరం.
విత్తనాలను థైరం 75%WS రెండు గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇక విత్తనాలు విత్తుకునే ముందు నేలలో తేమ ఉండేటట్లు జాగ్రత్త పడాలి.ఇక విత్తనానికి విత్తనానికి మధ్య పది సెంటీమీటర్లు, వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు, 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తు కోవాలి.ఇక కలుపు మొక్కల నియంత్రణ కోసం ఒక ఎకరంలో 200 లీటర్ల నీటిలో పెండి మెథాలిన్ 30% EC 300 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి.
పైన చెప్పిన వ్యవసాయ పద్ధతులను మొదటి నుండి చివరి వరకు సరైన క్రమంలో పాటిస్తే ముల్లంగి పంటలో నాణ్యతతో కూడిన అధిక దిగుబడి పొందవచ్చు.ఏవైనా చీడపీడల బెడద( Pest infestation ), తెగుళ్ల బెడద ఉన్న సమయంలో రకరకాల రసాయనాలు వాడకుండా వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహా మేరకు తక్కువ క్రమంలో రసాయనాలను వినియోగించాలి.పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపును తీసివేయడం ద్వారా రకరకాల పురుగులు పంట పొలాన్ని ఆశించడాన్ని చాలావరకు అరికట్టవచ్చు.