సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’.‘సాలా క్రాస్‌బ్రీడ్’ ఉప శీర్షిక.లెజెండ్ మైక్ టైసన్ ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలోకి అడుగుపెడుతున్నారు. మైక్ టైసన్ పుట్టినరోజుని పురస్కరించుకుని లైగర్ చిత్ర యూనిట్ ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ, ఛార్మీ కౌర్, విష్ణు, అనన్య పాండే, పూరీ జగన్నాధ్, టైసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే లైగర్ యుఎస్ షెడ్యూల్ మేకింగ్ విజువల్స్ ఈ వీడియోలో అలరించాయి.
ఈ చిత్రానికి సంబధించి మైక్ టైసన్ సన్నివేశాలు యుఎస్ లో చిత్రీకరించిన సంగతి తెలిసిందేమైక్ టైసన్ సింప్లీసిటీ, అణుకువ గల వైఖరితో లైగర్ టీమ్ అంతటితో కలిసి ఉల్లాసంగా వుండటం ఈ వీడియోలో చూడొచ్చు.మైక్ టైసన్, విజయ్ ని అప్యాయంగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకోవడం మెమరబుల్ మూమెంట్ గా నిలిచింది.
లైగర్ టీమ్ తో మైక్ కి వున్న అనుబంధం ఈ వీడియో లో చూడొచ్చు.

లైగర్ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది.పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా లైగర్ ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా, థాయ్‌లాండ్ కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.లైగర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.







