గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్.. టి20 ప్రపంచ కప్ ఆడే అవకాశం ఉందా..

ఆసియా కప్ సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 ప్రపంచ కప్ ఆడే సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు.రవీంద్ర జడేజా చాలా రోజుల నుంచి టీమిండియా విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

 Team India's Star All-rounder Who Has Recovered From Injury.. Is There A Chance-TeluguStop.com

జడేజా తన గాయానికి చికిత్స తీసుకున్న తర్వాత పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తూ ఒక వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.ఆ వీడియోలో ఈ స్టార్ ఆల్ రౌండర్ జిమ్ లో పరిగెత్తుతున్న దృశ్యాలు చూడవచ్చు.

ఈ వీడియోలో ఆల్ రౌండర్ పూర్తిగా కోరుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఫిట్నెస్ క్రికెట్ ఆడడానికి కావలసిన ఫిట్నెస్ సాధించగలడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఒకవేళ జడేజా ఫిట్నెస్ పరీక్షలో విజయం సాధించిన అతను టీం ఇండియా తో ఇప్పట్లో కలవడం సాధ్యం కాకపోవచ్చు.టి20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే గాయం కారణంగా జడేజా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో మరొక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను టి20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేశారు.

Telugu Rounder, Ravindra Jadeja, Cup, India-Sports News క్రీడలు

స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ ప్రస్తుతానికి ఫామ్ లోనే ఉన్నాడు.ఆసియా కప్‌ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌ల్లో అక్షర్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఇండియా విజయం లో కీలకపాత్ర పోషించాడు.ఇతని గురించి ఎంత చెప్పినా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా స్థానాన్ని మాత్రం అక్షర్ పటేల్ భర్తీ చేయలేడని క్రికెట్ అభిమానులు అనుకుంటూ ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా లో పర్యటిస్తున్న టీమిండియా అక్టోబర్‌ 23న దాయాది పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు సాధన చేస్తూ బిజీగా ఉంది.

ఈసారైనా టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలుస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube