తన కెప్టెన్సీ పై వస్తున్న విమర్శలకు.. ఘాటుగా స్పందించిన విరాట్ కోహ్లీ..!

ఐసీసీ ట్రోఫీని సాధించకపోవడంతో భారత జట్టు కెప్టెన్ గా ఉండే విరాట్ కోహ్లీ, ఆటగాడిగా రాణించిన, కెప్టెన్సీగా మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.తాజాగా తన పై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, తన కెప్టెన్సీలో జట్టు సెమీ ఫైనల్ వరకు వెళ్లిందని.

 Team India Cricketer Virat Kohli Shocking Comments About His Captaincy Details,-TeluguStop.com

ట్రోఫీలు సాధించకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారిందని ఘాటుగా స్పందించాడు.తాను కెప్టెన్సీ ఉన్న సమయంలో జట్టు ఆట తీరులో అనేక మార్పులు రావడం తో గర్వపడుతున్నట్లు, తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని తెలిపాడు.

Telugu Cricketervirat, Mahendrasingh, India, India Cricketer, Virat Kohli, Virat

2017లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2019లో ప్రపంచ కప్ టోర్నీ, 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2021 లో టీ 20 ప్రపంచ కప్ కు విరాట్ కోహ్లీ సారథ్యం వహించాడు.ఏ మ్యాచ్ అయినా గెలవడం కోసమే ఆడతాం.నాలుగు టోర్నమెంట్ల అనంతరం తనపై ఫెయిల్యూర్ కెప్టెన్ అనే ముద్రవేశారని, ఆ కోణంలో తనను తాను ఎప్పుడూ అంచనా వేసుకోలేదని తెలిపాడు.తాను ఆటగాడిగా ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచానని, ఐదు టెస్ట్ మ్యాచ్లు గెలిచిన జట్టులో తన భాగం కూడా ఉందని చెప్తూ ఆ కోణంలో చూస్తే ప్రపంచకప్ ను ఎప్పుడు గెలవని ఆటగాళ్లు చాలానే ఉన్నారని తెలిపారు.

Telugu Cricketervirat, Mahendrasingh, India, India Cricketer, Virat Kohli, Virat

ఇక 2011 వన్డే ప్రపంచ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో టీమిండియా దక్కించుకున్న టీం లో తాను కూడా ఒక ఆటగాడినని అందరికీ గుర్తు చేశాడు.తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో జట్టు ఆట తీరులో అనేక మార్పులు రావడం చాలా గర్వ కారణం.టోర్నమెంట్ ఒకసారి మాత్రమే జరుగుతుంది.కానీ జట్టు ఆటతీరులో మార్పు మాత్రం సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది.ఈ కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది అని తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube