ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న టీమిండియా క్రికెటర్.. ఈ రేంజ్ లో క్రేజ్ పెరిగిందా?

కొన్ని నెలల క్రితం వరకు సౌత్ ఇండియా ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన తారక్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉండటంతో పాటు నటుడిగా తన స్థాయిని పెంచుకుంటున్నారు.అయితే టీమిండియా క్రికెటర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకోగా ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Team India Cricketer Taken Ntr Autograph Details Here Goes Viral ,team India C-TeluguStop.com

క్రికెటర్ చాహల్ తన భార్య ధన్యశ్రీ వర్మ కొరకు తారక్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

ఒక్క గొప్ప క్రికెటర్ తారక్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అయితే ఈ రేంజ్ లో తారక్ క్రేజ్ పెరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ కొత్త సినిమాలు 300 కోట్ల రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం గమనార్హం.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.తారక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ ను సైతం మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఎన్టీఆర్ కొరటాల శివ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ ను జాన్వీ కపూర్ సొంతం చేసుకున్నారని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది.

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube