అతను ఒక స్కూల్లో మాస్టారు పాఠాలు చెప్పాల్సిన ఆ మాస్టారు ప్రేమపాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు అంతేకాదు ఆ స్టూడెంట్ ను పెళ్లి చేసుకుని కాపురం కూడా మొదలు పెట్టాడు అయితే అంత బాగుంది అనుకునేలోపే ఆ యువతికి అతడి నిజస్వరూపం తెలిసిపోయింది.దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన యువతి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదివింది.
ఆ సమయంలో సురేష్ అనే వ్యక్తి ఆ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.సురేష్ ఆ యువతిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి ఆమెను ప్రేమలోకి దించాడు.
పాఠాలు చెప్పాల్సిన ఉపాద్యాయుడు ప్రేమ పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు.అంతటితో ఆగకుండా గత సంవత్సరం సెప్టెంబర్ లో ఆ యువతిని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకుని కాపురం మొదలు పెట్టాడు.
కొన్ని రోజులు వీరి కాపురం బాగానే ఉంది.అయితే అంతలోనే ఆమెకు భర్త నిజస్వరూపం తెలిసి షాక్ అయ్యింది.
తన భర్తకు ఇంతకు ముందే పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది.
అంతేకాదు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండవ పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న యువతి భర్తను నిలదీయడంతో అప్పటి నుండి ఆమెను శారీరకంగా మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు.అంతేకాదు అతడి మేనల్లుడు, సోదరి కూడా ఆ యువతిని వేధించడం ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
దీంతో విసిగిపోయిన ఆమె వారి నుండి తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకొని వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు సురేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేసుకున్నారు త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
ఆ యువతి తల్లిదండ్రులు ఒక మోసగాడిని నమ్మి జీవితం నాశనం చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.