చంద్రబాబు ఆరోగ్య సమస్యల పేరిట టీడీపీ నయా డ్రామా..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాలేదన్న వార్త ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

 Tdp's New Drama On Chandrababu's Health Issues..!!-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆయన చర్మ సంబంధిత అస్వస్థతకు గురయ్యారన్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు అస్వస్థత నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆయన పరీక్షలు నిర్వహించారు.

ఈ క్రమంలో డాక్టర్లు సూచించిన మందులను అందిస్తున్నామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు.వైద్యుల సూచనల మేరకు చంద్రబాబుకు వైద్య సహాయం అందిస్తామన్న అధికారులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం బాలేదని, ఆయన అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో టీడీపీ నేతలు కొత్త డ్రామాకు తెరతీసారని తెలుస్తోంది.

ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ల విచారణ నేపథ్యంలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.నిన్నటి నుంచే టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా గేమ్ మొదలుపెట్టారని తెలుస్తోంది.

ఈ క్రమంలో నిన్నటి వరకు స్కిన్ అలర్జీ అన్న టీడీపీ ఈ ఉదయం నుంచి మరో డ్రామాను ప్లే చేస్తుందని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారని సమాచారం.

కానీ చంద్రబాబు సుమారు ఐదు కేజీల బరువు తగ్గారని, ఆయన కిడ్నీలకు ప్రమాదం అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది.

ఈ క్రమంలో చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని, బెయిల్ ఇవ్వాలని సరికొత్త డిమాండ్ ను బయటపెట్టింది.దీనిపై ఏపీ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు టీడీపీ నాటకాలు ఆడుతుందంటున్న కొందరు జనాలు వాతావరణం ఎక్కడైనా ఒక్కటే కదా అని ప్రశ్నిస్తున్నారు.ఇంటిలో ఓ రకంగా, జైలులో ఓ రకంగా వాతావరణం మారిపోదు కదా అంటున్నారు.

ఈ క్రమంలోనే వాతావరణాన్ని బేస్ చేసుకుని బెయిల్ ఇస్తే దేశంలో ఎంతమంది ఖైదీలకు ఇవ్వాలనే ప్రశ్న పలువురి మదిలో కదులుతోంది.చట్టం ఒక్కొక్కరికీ, ఒక్కోరీతిలో ఉంటుందా.? అనేది అర్థం కావడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.అంతేకాదు చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారా.? లేదా.? అన్నది చెప్పాల్సింది వైద్యులా.? టీడీపీ నాయకులా? అని ప్రశ్నిస్తున్నారు.ఈ ప్రశ్నలన్నింటికీ టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో వారికే తెలియాలని అంటున్నారు.

మొన్నటి వరకు తన భర్త ఆరోగ్యంగా ఉన్నారని, ధైర్యంగా పోరాడమన్నారని చెప్పిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇప్పుడేలా తన భర్తకు ఆరోగ్యం బాలేదని చెప్పగలుగుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఒకేసారి ఈ ఎత్తుగడలు ఎందుకు.? తప్పుడు ప్రచారాలు ఎందుకు.? చట్టం నుంచి తప్పించుకోవడానికే కదా.? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.కేసుల నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు కలిసి ఈ విధంగా డ్రామాలు ఆడటం ఎంతవరకు సమంజసం అని మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube