పుట్టపర్తిలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. నెలకొన్న ఉద్రిక్తత

TDP Vs YCP In Puttaparthi.. There Is Tension

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.

 Tdp Vs Ycp In Puttaparthi.. There Is Tension-TeluguStop.com

పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు పరస్పరం సవాళ్లు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సత్యమ్మ ఆలయం వద్ద ఇరువురు చర్చకు సిద్ధం అయ్యారు.

ఈ క్రమంలోనే రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పరస్పరం కర్రలు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు.దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పోలీసుల సమక్షంలోనే దాడులకు పాల్పడ్డారు.ఈ సందర్భంగా నెలకొన్న తోపులాటలో మాజీ మంత్రి పల్లె సొమ్మసిల్లి పడిపోయారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఇరు వర్గాల ఘర్షణలో వాహనం కూడా ధ్వంసమైందని సమాచారం.

Video : TDP Vs YCP In Puttaparthi There Is Tension #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube