బెజవాడ పొలిటికల్ సీన్ భిన్నంగా కనిపిస్తోంది.ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా.
అటు అధికార, ఇటు ప్రతిపక్షాల్లో ఆశించిన మేరకు దూకుడు కనిపించడం లేదని అంటున్నా రు పరిశీలకులు.పైగా ఇరు పార్టీల్లోనూ ఆదిపత్య పోరు కనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా పార్టీలను గెలిపించే బాధ్యతను ఎవరూ తీసుకోవడం లేదు.ఎవరికి వారు ఒక గిరి-బరి గీసుకుని.
అక్కడి వరకు మాత్రమే తాము పాలిటిక్స్ చేస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీని తీసుకుంటే.
ఐదుగురు ముఖ్య నాయకులు.ఇక్కడ చక్రం తిప్పుతున్నారు.
విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్ బొప్పనతో పాటు.మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్, దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు వంటివారు.కీలకంగా ఉన్నారు.అయితే.వీరిలో పైలా, విష్ణులు మాత్రం కలసి కట్టుగా వ్యవహరిస్తున్నారు.మిగిలిన వారు మాత్రం ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో పార్టీలో ఐక్యత కనిపించడం లేదని అంటున్నా రు పరిశీలకులు.

ఇక, టీడీపీ విషయానికి వస్తే.గ్రూపు గోలలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.ఎంపీ కేశినేని నాని ఒక్కరుగా ఉంటే.
మిగిలిన వారంతా ఒక గ్రూపుగా వ్యవహరిస్తున్నారు.అయితే, ఆర్థికంగా.
దూకుడు పరంగా.మా త్రం ఎంపీ వర్గానిదే పైచేయిగా ఉన్నప్పటికీ.
మేనేజ్ చేయడంలో మాత్రం ఆయన వెనుకడుగు వేస్తున్నా రనే వాదన వినిపిస్తోంది.ఇక, మిగిలిన వారిలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు ప్రజాక్షేత్రంలో పెద్దగా దూకు డు లేదనే టాక్ ఉంది.
ఇక, మాజీ మంత్రి దేవినేని ఉమా.కూడా ఇక్కడ చక్రం తిప్పుతారని భావిస్తున్నారు.అయినప్పటికీ.ఎవరూ కూడా కలిసి కట్టుగా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ.దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.