నెల్లూరు: నెల్లూరు నగరంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన కోవూరు టిడిపి ఎమ్మల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు టిడిపి, జనసేన, బిజెపి తోనే సాధ్యం.సంక్షేమ పథకాలు పట్ల చిత్త శుద్ది వున్న పార్టీ టిడిపి పార్టీ.
రాష్ట్రం లో గడచిన 5 ఏళ్లలో 6 వేల అక్రమ కేసులు పెట్టారు,180 మంది దళితులు చనిపోయారు.
ప్రజాగళం సభల్లో కూటమి 160 సీట్లు గెలుస్తుంది అని కూటమి గెలిస్తే సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తాం అని నారా చంద్రబాబు నాయుడు మాట ఇస్తున్నారు.
పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిస్తాం,నిరుద్యోగ భృతి క్రింద మూడువేల రూపాయిలు,మహిళలు కు ఉచిత బస్సు ప్రయాణం తో పాటు అనేక సంక్షేమ పథకాలను అందిస్తాం.కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.