వైసీపీ పార్టీ పై కీలక కామెంట్లు చేసిన నారా లోకేష్..!!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు పైనే జరుగుతున్నాయి.కరోనా లాంటి కష్టకాలంలో బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిని ప్రభుత్వం అరెస్టు చేసింది అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

 Tdp Nara Lokesh Serious Comments On Ycp Party Over Raghu Ramakrishnam Raju Arres-TeluguStop.com

ఇదే క్రమంలో రఘురామకృష్ణంరాజు కి హై కోర్టులో బెయిల్ రిజల్ట్ కావటం మరోపక్క తనని కొట్టినట్లు న్యాయస్థానానికి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయటం ఏపీ రాజకీయాలు ఉన్న కొద్ది వేడెక్కుతున్నాయి.దీనిలో భాగంగా రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు హైకోర్టు .రఘురామకృష్ణంరాజు కి అయిన గాయాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ వైద్య పరీక్షలు నిర్వహించాలని కమిటీ వేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా టీడీపీ పార్టీ నేత నారా లోకేష్ తాజా ఘటన పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ….ఒక బాధ్యతగల పార్లమెంట్ మెంబర్ పై థ‌ర్డ్‌ డిగ్రీ ప్ర‌యోగించ‌డం దారుణమైన చర్య అని .ఏపీలో  ఐపీసీ సెక్ష‌న్ల బ‌దులు వైసీపీ సెక్ష‌న్లు అమలు అవుతున్నట్లు పేర్కొన్నారు.సోషల్ మీడియాలో స్పందిస్తూ … “ నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు అక్రమంగా అరెస్టు చేయడమే కాక థ‌ర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని.

ఇది దుర్మార్గమైన చర్య.రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ అమ‌లుచేయాల్సిన పోలీసులు జగన్ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా అరాచ‌కాల‌కు తెగ‌బ‌డుతున్నారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్షం, ప్ర‌జ‌ల‌కి ఇంకెక్క‌డి ర‌క్ష‌ణ‌? ఏపీలో ఐపీసీ సెక్ష‌న్ల బ‌దులు వైసీపీ సెక్ష‌న్లు అమ‌ల‌వుతున్నాయి.ఏపీలో అరాచ‌క‌పాల‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్ర‌ప‌తి, లోక్ స‌భ స్పీక‌ర్‌, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ స‌త్వ‌ర‌మే స్పందించాలి.

కేంద్ర‌ బృందాల‌తో న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలి.ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి.

” అంటూ నారా లోకేష్ కీలక కామెంట్లు చేశారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube