యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళిత భూముల కోసం పోరాటం చేస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పై పోలీసులు దౌర్జన్యం చేశారు.ముందుగా కారులోనే ఎమ్మెల్యే ను నిర్బంధించి అనంతరం పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు బలగాల మధ్య రామానాయుడును అదిరించి బెదిరించి అక్రమంగా అరెస్టు చేశారు.
దళితుల భూములు పై ఉన్న కోర్టు స్టే ను చూపించాలని అలాగే రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చిన తర్వాతే తాను ఆందోళన నిర్మిస్తానని ఎమ్మెల్యే పట్టుపట్టారు.
అయినప్పటికీ నరసాపురం డి.ఎస్.పి మనోహర్ మనోహరాచారి ఆధ్వర్యంలో నలుగురు సిఐలు 15 మంది ఎస్ఐలు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు బలగాలతో ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి చేశారు.దళితులపైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పోలీసులు దౌర్జన్యం చేసే అడ్డు వచ్చిన వారిని పక్కకు ఈడ్చేశారు.రామానాయుడును బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించుకొని పాలకొల్లు వైపు తీసుకెళ్లారు…