వర్ల రామయ్య టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు.చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గవర్నర్ గారిని కలవడం జరిగింది.
ఈ మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన అరాచక పాలన పై పిర్యాదు.ఇంకొంచెం యాక్టివ్ గా పనిచేసి ఉంటే బాగుండేది, ఇక్కడకి చంద్రబాబు నాయుడు రావాలి కానీ తారక రత్న కార్యక్రమంలో ఉన్నారు.
గవర్నర్ వెళ్లిపోతున్నా సందర్భంగా వీడ్కోలు పలికాము.కొనకళ్ల నారాయణ ఎక్స్ యంపి కామెంట్స్.
వల్లభనేని వంశీ టీడీపీ తరుపున గన్నవరంలో గెలిచి వైసిపికీ వెళ్లి అరాచకాలు చేస్తున్నాడు.రౌడీయిజం చేస్తున్నారు.
ఈ రోజు టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు.
చేతకాని పోలీసు వ్యవస్థ దేనికి వంశీ అనుచరులను పంపించి పార్టీ ఆఫీస్ లపై దాడి చేసి కార్లు కాల్చివేసారు.
అసలు నీకు మనసాక్షి ఉందా అక్కడ టీడీపీ ఇంఛార్జి చావు బ్రతుకుల మధ్య ఉంటే దాడులు చేస్తున్నారు.విమర్శకు ప్రతి విమర్శ రాజకీయం, నువ్వు ఎన్ని చేసినా గన్నవరం ప్రజలు నిన్ను ఓడిస్తారు.
వెంటనే వంశిపై పై చర్యలు తీసుకోవాలని అన్నారు.బుద్దా వెంకన్న ఎక్స్ ఎమ్మెల్సీ కామెంట్స్.
రెండు సంవత్సరాలుగా కొడాలి నాని, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ జగన్ మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం చేస్తున్నారు.మీకు దమ్ముంటే ఎన్ టి ఆర్ సర్కిల్ దగ్గర మీరే టైమ్ చెప్పి వస్తె మీరో మేమో తేల్చుకుందాం.
ఎవరూ లేని టైమ్ లో ఆఫీస్ లు పగలకొట్టడం మగతనమా.మీకు బీ ఫారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు దానికా.ఈ బహుమానం త్వరలో వీరందరూ ఎందుకు పార్టీ మారారో, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో వీరి పత్రాలు అన్ని వివరంగా చెబుతా.కొడాలి నాని ఎన్ టి ఆర్ డి ఎన్ ఏ లా మాట్లాడుతాడు, పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో ఉంది వాళ్ళను గొడవ దగ్గరకు రావద్దు అని చెప్పండి కొట్టుకుందాం.
మీకు 4+4 గన్ మెన్ లు ఎందుకు, మీకు నిజంగా మీసం మొలిచిన వారు అయితె రండి కొట్టుకుందాము.వీరు ఆరాచకం చేస్తున్నారు.చెసే పనులు ఆడంగి పనులు అని అన్నారు.