ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎన్నికలు అన్నట్లు రాజకీయాలు మొదలు పెట్టారు.అన్ని ప్రధాన పార్టీలు తమదైన శైలిలో రాజకీయాలు మొదలు పెట్టాయి.
జిల్లాల్లో పర్యటిస్తూ అధికారం తమదేనని చెప్పుకుంటున్నాయి.ఇక ప్రతిపక్షాల పొత్తుల విషయం రోజుకో మలుపు తిరుగుతోంది.
ఇక ఆశావహులు కూడా తమ సీట్ల విషయంలో కూడా మంతనాలు జరుపుతున్నారు.సీటు దక్కుతుందో లేదోనని బెంగపెట్టుకుంటున్నారు.
దీంతో ఎవరికి వారు… వచ్చే ఎన్నికలకు సంబంధించి వారు.తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటు వైసీపీలో కంటే.టీడీపీలోనే ఈ తరహా కనిపిస్తున్నాయి.
కేంద్రంలో బీజేపీతో దోస్తీకి సిద్దమైన టీడీపీ.కేంద్రంలో మారుతున్న పరిణామాలు వంటివి గమనిస్తున్న నాయకులకు.
వచ్చే ఎన్నికల పోరులో టీడీపీ గెలిచేందుకు అవకాశాలు మెరుగు పడుతు న్నాయ ని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే టికెట్ల కోసం.
నాయకులు పోటీ పడుతున్నారు.ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి ఉండటంతో నాయకులు టికెట్ కోసం.
అధినేత మెప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.సొంత పార్టీ నేతలే పోటీకి వస్తుండటంతో తర్జన బర్జనలు పడుతున్నారు.
ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఇదే పరిస్థితి కనబడుతోంది.ఈ జిల్లాలోని.
రాజాం ఎస్సీ నియోజకవర్గం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.ఇక్కడ టీడీపీ గత కొన్నాళ్లుగా విజయానికి దూరంగా ఉంది.
ఒకప్పుడు ఇక్కడ నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.కానీ 2009లో కాంగ్రెస్ నుంచి ఇక్కడ కోండ్రు మురళీ మోహన్ గెలిచా రు.తర్వాత వైసీపీ విజయం సాధించింది.

ఇద్దరూ పోటీ పడుతూ.
అయితే గత ఎన్నికలకు ముందు కోండ్రు టీడీపీలో చేరారు.దీంతో టీడీపీ నుంచి టికెట్ ఇవ్వగా ఓటమి చెందారు.
తర్వాత పార్టీలోనే ఉన్నప్పటికీ సైలెంట్ అయిపోయారు.అయితే ప్రస్తుతం ఆయన టికెట్ ఆశిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని చెబుతున్నారట.అయితే ఇక ఇదే నియోజకవర్గంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ పోటీ చేయాలని అనుకుంటున్నారట.
ఇటీవల జరిగిన మహానాడులోనూ గ్రీష్మ.తొడగొట్టి మరీ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు.
దీంతో ఒక్కసారిగా ఫోకస్ అయ్యారు.చంద్రబాబు కూడా ఆమెను ప్రోత్సహించాలనే నిర్ణయించుకున్నారట.
దీంతో కోండ్రు మురళి టెన్షన్ పడుతున్నారట.అయితే తనకే టికెట్ ఇస్తారని.
గ్రీష్మ గెలవదని యాంటీ ప్రచారం చేయిస్తున్నారని గ్రీష్మ వర్గం ఆరోపిస్తోంది.గ్రీష్మ కార్యక్రమాలకు నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని టాక్.
ఇక అధినేత చంద్రబాబు రాజాం టికెట్ ఎవరికి కేటాయిస్తారో వేచి చూడాల్సిందే…
.