ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు.ప్రజలకు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం లేదు.అరాచకమే ఉందని ప్రజలకు అర్ధం అయిందని పయ్యావుల అన్నారు.22 ఎమ్మెల్యేల ఓట్లు పడితే ఒక ఎమ్మెల్సీ గెలుస్తామన్నారు.టీడీపీ అభ్యర్థి గెలుపొందిన డిక్లరేషన్ పత్రం ఇవ్వకుండా అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు.
ఇతరులు గెలిస్తే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.ప్రజాస్వామ్యం, హక్కులు వంటి మాటలు సజ్జల మాట్లాడాకుండ ఉంటేనే బెటర్ అని వెల్లడించారు.







