ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుని జైలుకి పంపాలన్నది జగన్ కలని తెలిపారు.
సీఐడీ వైసీపీ జేబు సంస్థగా పని చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.రాష్ట్ర సంపదను దోచుకుంటూ పోలీసులను పహారా పెట్టుకున్నారన్నారు.
పీవీ రమేశ్ వ్యాఖ్యలను కూడా వక్రీకరించారని తెలిపారు.సత్తెనపల్లిలో శాంతియుతంగా బంద్ చేస్తున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లని తీరు దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.అనంతరం పవన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.