చింతకాయల అయ్యన్నపాత్రుడు; జగన్ ప్రభుత్వం పై ఒంటి కాలిపై లేచే టిడిపి నాయకుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరు.ప్రభుత్వంపై నిత్యం విమర్శల జడివాన కురిపించే అయ్యన్నపాత్రుడు పై ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా ఉంటుంది.
ఏ చిన్న అవకాశం దొరికినా అతనిపై కేసులు పెడుతుంటుంది.ఇప్పటికే అనేకసార్లు ఆయనను అర్ధరాత్రి అరెస్టు చేసి మరీ కక్ష తీర్చుకున్న జగన్ ప్రభుత్వం సాక్షాదారాలు దొరికితే ఆయనకు శిక్ష వేయించే వరకు నిద్రపోదని అలాంటిది జగన్ ప్రభుత్వంలో అయ్యన్న పెట్టుబడులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారా ఈ వివరాలు చదవండి.

అయ్యన్నకు విశాఖ భోగాపురం మధ్యలో సన్ రే రిసార్ట్ పేరుతో ఒక రిసార్ట్ ఉంది అది చాలా పాపులర్ కూడా ఇంతకుముందు ఇదే రిసార్ట్ విషయమై గంటా శ్రీనివాసరావు తో కొంత గలాటా కూడా నడిచినట్లు సమాచారం.భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజేషన్ సమయంలో ఈ రిసార్ట్ భూములు కూడా లిస్టులో అధికారులు తీసుకున్నారని అప్పుడు మంత్రి గంటాను కలిసి లిస్ట్ నుండి భూమిని తొలగించాలని కోరినప్పటికిని ఆయన అంగీకరించలేదని దానితో గంటాకు అయ్యన్నకు మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయని వినికిడి .ఈ విషయంపై చంద్రబాబును కలిసిన అయ్యన్న పాత్రుడు తనకు అనుకూలంగా ఉండేలా చక్రం తిప్పారని బోగట్టా.

ఇప్పుడు అదే రిసార్ట్ పేరుతో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 250 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినట్టు సమాచారం. సన్ రే విలేజ్ రిసార్ట్ పేరుతో ఈ పెట్టుబడులు జరిగాయి.సన్ రే రిసార్ట్ లిమిటెడ్ మరియు సెంట్రల్ విలేజ్ రిసార్ట్ రెండు ఒకే మాతృ సంస్థకు చెందిన సంస్థలని ఇందులో అయ్యన్న దంపతులు డైరెక్టర్ లని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది ఎంత వరకూ నిజమో పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ మరి ఇదే నిజమైతే జగన్ ప్రభుత్వాన్ని నమ్మి అయ్యన్న పెట్టుబడులు పెట్టినట్లుగా అవుతుందని అది రాజకీయంగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాలి.







