టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిందే.మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.తెలుగులో చివరిగా హ్యాపీ బర్త్డే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
కాగా లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన వెబ్ సిరీస్ పులి మేక.గత నెల 24 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్ మంచి హిట్ టాక్ ని అందుకొని దూసుకుపోతోంది.

ఇకపోతే లావణ్య తెలుగులో మంచు విష్ణు, శర్వానంద్, నాగార్జున, నాని, నాగచైతన్య, కార్తికేయ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది.అలాగే ఈ ముద్దుగుమ్మ తెలుగులో అందాల రాక్షసి,మనం, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, చావు కబురు చల్లగా, ఇంటిలిజెంట్,అర్జున్ సురవరం లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాటి పలు ఆసక్తికర విషయాల గురించి వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి తెలిపింది.తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ షో చేశానని అందుకు ఆమె రూ.5000 అందుకున్నట్లు తెలిపింది.ఆ డబ్బుతో మొదటిసారి తాను మొబైల్ కొనుకున్నట్లుగా కూడా తెలిపింది.అలా అంత చిన్న రెమ్యూనరేషన్ నుంచి కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్కో సినిమాకి లక్షల్లో పారితోషికం అందుకుంటోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో లావణ్య మొదటి పారితోషికం అంత తక్కువ నా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







