టీడీపీ కీలక నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్..!!

తెలుగుదేశం పార్టీ నేత మాజీమంత్రి బండారు సత్యనారాయణ( Bandaru Satyanarayana ) ఇటీవల వైసీపీ మంత్రి రోజాపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.మంత్రి రోజాపై( Minister Roja ) జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Tdp Key Leader Former Minister Bandaru Satyanarayana Arrested Details, Tdp, Band-TeluguStop.com

మీడియా సమావేశం నిర్వహించి మంత్రి రోజాతో పాటు సీఎం జగన్ పై( CM Jagan ) కూడా బండారు సత్యనారాయణ కామెంట్లు చేయడం జరిగింది.దీంతో ఆయనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

ఈ క్రమంలో హైడ్రామా మధ్య అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు తొలుత ప్రయత్నించారు.మొదట బండారు సత్యనారాయణమూర్తి ఇంటి తలుపులు తెరవకపోవడంతో కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు( TDP ) ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు.తర్వాత తలుపులు బద్దలు కొట్టి నోటీసులు అందజేశారు.అనంతరం అరెస్టు చేయడం జరిగింది.బండారు అరెస్టును తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube