TDP, Janasena : నేడు టిడిపి జనసేన తొలి జాబితా విడుదల .. ఎన్ని సీట్లు అంటే ?

ఎప్పటి నుంచో అదిగో ఇదిగో అంటూ ఆలస్యం చేస్తూ వస్తున్న టిడిపి, జనసేన ( tdp ,janasena ) పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఎట్టకేలకు నేడు విడుదల చేసేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ( Ysrcp ) తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల  జాబితాను చాలా వరకు విడుదల చేసింది.

ఇంకా మరికొన్ని నియోజకవర్గాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఇది ఇలా ఉంటే బిజెపితో( BJP ) పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతుండడంతో కొద్ది రోజులుగా అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది.

అయితే నేడు మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

Tdp Janasena First List Release Today How Many Seats

ఇప్పటికే అనేకసార్లు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్( Chandrababu,Pawan Kalyan ) సమావేశమై చర్చించారు.నేడు తోలి జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో రెండు పార్టీల ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలంటూ రెండు పార్టీలు సమాచారాన్ని ఇచ్చాయి.ఉదయం 9 గంటల కు పార్టీ ఆఫీసుకు చేరుకోవాలని సూచించారు.

Advertisement
Tdp Janasena First List Release Today How Many Seats-TDP, Janasena : నేడ�

తొలి జాబితా ను ఉదయం 11:40 గంటలకు విడుదల చేయాలని ముహూర్తాన్ని నిర్ణయించారు.రెండో జాబితాను విడుదల చేయవలసినందుకు మరికొంత సమయం తీసుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించాయి.

అయితే బిజెపి( Bjp ) పోటీ చేసే అవకాశం లేని నియోజక వర్గాలు, వివాదాలు లేని వాటిని మొదటి జాబితాలో చేర్చారు.ఈ జాబితా విడుదలతో రెండు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపువచ్చని టిడిపి, జనసేన భావిస్తోంది.

Tdp Janasena First List Release Today How Many Seats

మొదటి విడత జాబితాలో 60 నుంచి 70 సీట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక బిజెపితో పొత్తు పై క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిస్థాయి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.అయితే బిజెపి వైఖరి చూస్తే .పొత్తు పెట్టుకునే ఆలోచన లేనట్టుగానే వ్యవహరిస్తోంది.దీంతో ఈ విషయం అధికారికంగా తేలే వరకు వేచి చూడాలని చంద్రబాబు పవన్ నిర్ణయించుకున్నారట.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు