విష జ్వరాలతో వణుకుతున్న గ్రామీణ ప్రాంతాలు...!

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, తండాల్లో వందలాది మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సిబ్బంది సరిగా రాక,వచ్చినా మందు బిళ్లలతో సరిపెట్టడంతో జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వైద్యులను, గ్రామాల్లో ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.

 Rural Areas Trembling With Poisonous Fevers , Rural Areas, Nalgonda District ,d-TeluguStop.com

ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం( Nagarjuna Sagar Assembly constituency )లో కమలానెహ్రు హాస్పటల్ మరియు హాలియాలో 50 పడకల ఆస్పత్రి,పీహెచ్‌సీ ఉన్నాయి.వీటితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

ఇటీవల నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి(J ayveer Reddy ) జ్వరాల ప్రభావం ఉన్న నిడమానూరు మండలం పార్వతీపురం గ్రామంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు.

వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు.

అయినా ఇంతవరకు అతీగతీ లేదని వాపోతున్నారు.గ్రామాల్లో,తండాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తూ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని తెలుస్తోంది.

అత్యధిక శాతం గ్రామాల్లో మురుగు కాలువలు లేవు.బురద, మురుగునీరు ఇళ్ల ముందుకు చేరుతోంది.

వాటిని దోమలు ఆవాసంగా చేసుకుని రాత్రి అయ్యిందంటే చాలు దోమల మోతమోగుతోంది.దోమల వల్ల ప్రజలు విష జ్వరాల( Poisonous fevers ) బారిన పడుతున్నారు.

జ్వరాలతో గ్రామాలకు గ్రామాలే తల్లడిల్లుతున్నా అధికారులకు మాత్రం ఏమీ పట్టడంలేదు.తూతూ మంత్రంగా గ్రామాలను సందర్శిస్తూ తమ పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారని,గ్రామాల్లో జ్వరాలు ప్రబలటానికి పారిశుద్ధ్య లోపమేనని పలువురు ఆరోపిస్తున్నారు.

పలు గ్రామాల్లో వీధులు మురికి కూపాలను తలపిస్తున్నాయని,ఇళ్ల ముందే అపరిశుభ్రత నెలకొని దుర్గంధం వెదజల్లుతోందని,జిల్లా వ్యాప్తంగా నాగార్జున సాగర్,మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో గిరిజన ప్రాంతాలు ఉండడంతో పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని,పారిశుద్ధ్యం మెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పెద్దవూర మండలం నాయనవానికుంట తండా విష జ‍్వరాలతో గ్రామం మొత్తం మంచం పట్టింది గ్రామస్తుడు రమావత్ శర్మన్ అంటున్నారు.

మురుగునీరు రోడ్లపై నిలిచి పరిసరాలు కలుషితమయ్యాయి.ఇక దోమలు కూడా వృద్ధి చెంది వ్యాధులకు కారణమయ్యాయని, తండా మొత్తం దాదాపు 200 మందికి పైగా రోగాల భారినపడ్డారని,ఆర్థిక స్థోమత లేక స్థానిక ఆర్‌ఎంపీలతోనే చికిత్సలు పొందుతున్నారని వాపోయారు.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube