ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో జనసేన తెలుగుదేశం( Janasena ,Telugu Desam party ) కూటమి విజయం పై అనేక ఊహాగానాలు, అంచనాలు ప్రచారం లో ఉన్నాయి.ఈ పొత్తు విన్నింగ్ కాంబినేషన్ అని మెజారిటీ రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నా, ఈ రెండిటికి సాంప్రదాయకంగా వస్తున్న ఓటు బ్యాంకుల మధ్య సఖ్యత పొత్తు కి చాలా సమస్యలు కూడా ఉన్నాయన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా జనసేనకు మద్దతిస్తున్న సామాజిక వర్గాలకు టిడిపి కి మద్దత్తు ఇస్తున్న సామాజిక వర్గాలకు మధ్య అంతరాలు దశాబ్దాలు నాటి వన్నది కొంతమంది అంచనా.దానితోపాటు 2019 ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య కొంత యుద్ద వాతావరణం కూడా నడిచింది.
దాంతో ఈ రెండు పార్టీల పొత్తు క్షేత్రస్థాయిలో ఏ మేరకు బలపడుతుందన్న దానిని బట్టే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఆధారపడి ఉంటాయని మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా దీనిపైన ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.
ఈనెల 23వ తారీఖున రాజమండ్రిలో టిడిపి ముఖ్య నేత లోకేష్( Lokesh ) జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మధ్య కీలక సమావేశం జరిగింది.ఇప్పుడు దానికి కొనసాగింపుగా జిల్లాల వారి సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి.

వచ్చే ఎన్నికలలో క్షేత్రస్థాయిలో చేసుకోవాల్సిన ఏర్పాట్లు గురించి, ఉమ్మడి ప్రచారం గురించి ,మేనిఫెస్టో గురించి, టికెట్ దొరకని ఆశావాహులను బుజ్జగింపవలసిన విధి విధానాల గురించి ఈ సమావేశాలలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది.నిన్న ఆదివారం విజయనగరం, తూర్పుగోదావరి అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో సమావేశాలు జరిగాయి .రేపు పశ్చిమగోదావరి, కృష్ణ, కడప, చిత్తూర్, ఎల్లుండి విశాఖపట్నం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో సమన్వయ సమావేశాలు జరగనున్నట్లుగా తెలుస్తుంది.ఇక నవంబర్ ఒకటో తారీఖున ప్రకటించే ఉమ్మడి మేనిఫెస్టో( Joint Manifesto ) తర్వాత పూర్తిస్థాయి ప్రచారంపై ఈ రెండు పార్టీలు దృష్టి పెట్టబోతున్నట్లుగా చెల్లిస్తుంది.
ఏది ఏమైనా రెండు పార్టీల పొత్తుకు ప్రధాన అడ్డంకి గా ఉన్న క్షేత్రస్థాయి సమన్వయాన్ని ఈ రెండు పార్టీలు సీరియస్ గానే మొదలు పెట్టిన దరిమిలా మరి కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయి సమన్వయంతో ఎన్నికల ప్రచార బేరిని మోగించి సానుకూల పలితాలను సాదిస్తామని ఈ రెండు పార్టీల అభిమానులు అంచనా వేస్తున్నారు
.