టీడీపీ పై ప్రజాగ్రహం. కారణమేంటో తెలుసా?

రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన రాష్ట్ర ప్రజలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరున్న చంద్రబాబు నాయుడిని సీఎంగా గెలిపించారు.రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన ఆయన తన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆయనకు విజయాన్ని చేకూర్చారు.

 People Angry On Tdp Leaders, Tdp, Jagan Mohan Reddy, Ysrcp, Corruption On Tdp, J-TeluguStop.com

కాంగ్రెస్ పుణ్యమా అని రెండు సార్లు ప్రతిపక్షంలోకి వెళ్ళిన టీడీపి నాయకులు డబ్బులు సంపాదించుకోవడం కోసం చంద్రబాబు నాయుడిని తప్పు దారి పట్టించారు.

దాని ఫలితంగా గ్రౌండ్ లెవెల్ లో అవినీతి ఎక్కువ అయ్యింది.

వ్యవస్థలు గాడి తప్పాయి.జగన్ వస్తే ఏం జరుగుతుందని ప్రచారం చేశారో టీడీపి అదే చేయడం ఏ మాత్రం రుచించని ప్రజలు వారికి దారుణ ఓటమిని కట్టబెట్టారు.

దీంతో ప్రజాగ్రహం తమపై నుండి వైసీపీ పై మళ్ళిందని టీడీపి భావించింది.కానీ ఇప్పటికీ టీడీపి నాయకులపై గ్రౌండ్ లెవెల్ లో ప్రజాగ్రహం అలాగే ఉంది.

అందుకే స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై మనం పోరాటం చేస్తున్నాం అని పిలుపునిస్తున్న ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.దీనికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వెంటనే కోర్టులకు వెళ్తూ ప్రజలకు జరగాల్సిన సంక్షేమ పథకాల్ని అడ్డుకుంటుంది టీడీపి నాయకులనే ప్రజలు ఫీల్ అవుతున్నారు.

ఇది ఇలానే జరిగితే, టీడీపీ తమ ధోరణి మార్చుకోకపోతే తాము మరోమారు ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్ కు సూచిస్తున్నారు.మరి దీన్ని పట్టించుకోని టీడీపి తమ్ముళ్లు మారుతారో లేదో వేచి చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube