గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని మంత్రి విడదల రజిని కార్యాలయంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు ఖండించారు.మంత్రితో కలిసి ధ్వంసమైన కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు.
ఎన్నికల సమయంలో దాడులకు పాల్పడటం టీడీపీకి అలవాటుగా మారిందని ఎమ్మెల్యే మద్దాలి ఆరోపించారు.బీసీ మహిళ నేతకు చెందిన కార్యాలయంపై దాడికి పాల్పడటం దారుణమని పేర్కొన్నారు.
ఈ విధంగా దాడులకు పాల్పడుతున్న రౌడీ మూకలను ప్రజలు క్షమించరని తెలిపారు.అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.







