దసరా కు టిడిపి ఫస్ట్ లిస్ట్?

కేంద్రంలో జమి లీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రాంతీయ పార్టీలు కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.రాజకీయ సమీకరణాలు వేగంగా మారి ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధపడాలన్నట్లుగా ప్రాంతీయ పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం దసరాకు మొదటి లిస్టు అభ్యర్థులను ప్రకటిస్తుందన్నట్లుగా తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 Tdp First List For Dussehra , Tdp, Dussehra, Andhra Pradesh, Telugudesam Cand-TeluguStop.com

దాదాపు 75 నియోజకవర్గాల వరకు అభ్యర్థులను ప్రకటిస్తారని ,పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలను తప్పించి మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు కన్ఫామ్ చేసినట్టే అంటూ తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి .

Telugu Andhra Pradesh, Dussehra-Telugu Political News

పెద్దగా పోటీ లేని నియోజక వర్గాల లోనూ పొత్తులో భాగంగా కూడా తమకు మాత్రమే దక్కే నియోజకవర్గాలను హైలెట్ చేసుకుంటూ 75 సీట్లను తెలుగుదేశం ఖరారు చేస్తుందన్నది ఈ విశ్లేషణలు సారాంశం.అయితే 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 75 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం అంటే తెలుగుదేశం చాలా డేర్ చేస్తున్నట్టే చెప్పాలి .ఎందుకంటే తెలుగుదేశానికి కీలక భాగస్వామి అయిన జనసేన ( Janasena )తమకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తే మాత్రమే పొత్తు కి ఒప్పుకుంటామని తేల్చేసిన దరిమిలా మరి చర్చలు మొదలుపెట్టకుండానే తమ అభ్యర్థులను ప్రకటించడం పొత్తు మర్యాద కాదని దానికి ఆ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి .అయితే లోపాయికారిగా ప్రాథమిక పొత్తు చర్చలు జరిగాయని జనసేన పోటీకి రాని నియోజకవర్గాలలో మాత్రమే తెలుగుదేశం అభ్యర్థులను ( Telugudesam candidates )ప్రకటిస్తుందని పొత్తులో భాగంగా పంచుకోవాల్సిన నియోజకవర్గాలలో మాత్రం తరువాత చూసుకుంటారని వార్తలు వస్తున్నాయి .అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ముందుకు నడవాలన్న అవగాహన రెండు పార్టీలకు ఉన్నందున ఇదేమీ పెద్ద ఇబ్బంది కాదంటూ కొంతమంది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Telugu Andhra Pradesh, Dussehra-Telugu Political News

అయితే జనసేన కూడా తమ అభ్యర్థులు బలంగా ఉన్నచోట్ల 20 కి తక్కువ కాకుండా సీట్లను ప్రకటించే అవకాశం కూడా ఉందని దసరా సందర్భంగా ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.అదే జరిగితే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల యుద్దం అదికరికంగా మొదలైనట్టే చెప్పవచ్చు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube