తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలు ముఖ్య భూమిక పోషించయనే చెప్పాలి.ప్రజలను ఆకట్టుకునేలా ఆరు గ్యారెంటీ హామీలను రూపొంచి వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధించింది హస్తం పార్టీ.
అయితే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వ్యూహాన్ని ఏపీలో టీడీపీ కాపీ కొడుతోందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.కర్నాటక ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలనే ప్రస్తావించి అధికారంలోకి వచ్చింది.
ఆ టైమ్ లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోను పోలిన మినీ మేనిఫెస్టో( TDP Manifesto )ను రూపొందించి ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
పేదలను ధనవంతులు చేయడం, బీసీలకు రక్షణ చట్టం కల్పించడం, ఇంటింటికి తాగు నీరు, రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు, మహా శక్తి కింద ప్రతి మహిళకు నెలకు రూ 1500, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం.ఇలా ఆరు హామీలను మినీ మేనిఫెస్టో రూపంలో గతంలోనే ప్రకటించారు చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఈ హామీలు కాంగ్రెస్ హామీలను పోలి ఉన్నాయని మొదటి నుంచే విమర్శలు వస్తున్నప్పటికి టీడీపీ శ్రేణులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండగా వీలైనంత త్వరగా ఈ ఆరు గ్యారెంటీ హామీల( Six-guarantees )పై ప్రజల దృష్టి పడేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది.అదే విధంగా జగన్ పాలనపై కూడా విమర్శనాత్మకంగా ప్రకటనలను రూపొందించి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన కూడా టీడీపీ అధిష్టానం చేస్తున్నట్లు వినికిడి.తెలంగాణ ఎన్నికల సమయం కేసిఆర్ పై సెటైరికల్ గా కాంగ్రెస్ రూపొందించిన డిజిటల్ ప్రకటనలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
అదే స్ట్రాటజీని ఏపీలో టీడీపీ కూడా ఫాలో అయ్యేందుకు సిద్దమౌతోందట.మొత్తం మీద కాంగ్రెస్ విన్నింగ్ స్ట్రాటజీని టీడీపీ గట్టిగానే కాపీ కొడుతున్నట్లు తెలుస్తోంది.మరి కాంగ్రెస్ కు సక్సస్ తీసుకొచ్చిన స్ట్రాటజీలు టీడీపీకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.