మహాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారమే పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ను పిలిపించి.ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.
అభ్యర్థుల జాబితాను ఈనెల 8 లేదా 9న ప్రకటిస్తామన్నారు.తెదేపాతో 14 సీట్లకు అంగీకారం కుదిరిందన్నారు.

టీజీఎస్ , సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్ చెప్పారు.మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్ బరిలో ఉంటుందని, మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయన్నారు.కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈనెల 8న మరోసారి సమావేశమై అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశముంది.కూటమిలోని పార్టీలతో చర్చలు పూర్తయ్యాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఉత్తమ్ ప్రకటించారు.







