ఉమ్మడి ప.గో జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రారంభమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన.
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు.పంట నష్టం పై తమ బాధలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైన రైతులు.
తడిచిన ధాన్యం చూపించిన అన్నదాతలు.అకాల వర్షాలకు తోడు….
ప్రభుత్వ విధానాల వల్ల మరింత నష్టం అన్న రైతులు.ధాన్యం సేకరణకు సంచులు సైతం ఇవ్వలేదన్న చెప్పిన రైతులు.
ధాన్యం తడిచిపోయి రోడ్డున పడ్డ వైసిపి కార్యకర్తకు చంద్రబాబు చేయూత.పర్యటనకు వచ్చిన చంద్రబాబు ముందు తన ఆవేదన చెప్పిన వైసీపీ మహిళా రైతు ప్రభావతి.
రేపు ఉదయం తన కుమార్తెకు పరీక్ష ఉందని చేతిలో చిల్లిగవ్వలేదని చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ మహిళా కార్యకర్త ప్రభావతి.ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలు….
ధాన్యం తడిచినా మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ప్రభావతి.
ప్రభావతి కోరిక మేరకు అక్కడిడక్కడే రెండు లక్షల 30 వేల రూపాయల ఆర్దిక సాయం అందజేసిన చంద్రబాబు.
వైసిపి మహిళా రైతు బాధ విని సాయం అందజేసిన చంద్రబాబు.చంద్రబాబు చేసిన సాయానికి వైసీపీ కండువాని ఈ క్షణమే తీసేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటానని చెప్పిన ప్రభావతి.
నేను సాయం చేసేటప్పుడు పార్టీలు చూడనని చెప్పిన చంద్రబాబు.ఆడబిడ్డ చదువు కోసం తాను సాయం చేశానని ప్రకటించిన చంద్రబాబు.వైసీపీని గెలిపించి తప్పు చేశానని చంద్రబాబు ముందు కన్నీటి పర్యంతమైన ప్రభావతి.అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….
జులపల్లి ప్రభావతి నాడు వైసీపీ కోసం ప్రయత్నం చేసింది.

ఒక ప్రభుత్వం బాధ్యత గా ఉండాలి.కానీ ఈ ప్రభుత్వం ఇలాగేనా వ్యవహరించేది.నిండా మునిగాను ఆదుకోండి అని ప్రభావతి అడిగింది.
టీడీపీ అధికారం లో ఉండి ఉంటే ఇంత కష్టం ఉండేది కాదు.వర్షాలపై అలెర్ట్ చేసేందుకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి.
అసమర్థ దద్దమ్మ సీఎం ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది.నాడు హుద్ హూద్ వస్తే హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్ళాను.
ఫ్లైట్ వెళ్లదు అంటే….రోడ్డు మార్గం లో విశాఖ వెళ్ళాను.
అది నా పట్టుదల….సీఎం గా నేడు జగన్ కు బాధ్యత లేదాఎందుకు రైతుల దగ్గరకు సీఎం రాలేదు.
సివిల్ సప్లై కార్పొరేషన్ కొత్తగా పెట్టమా.ఏప్రిల్ మొదటి నుంచే ధాన్యం సేకరణ జరగాలి, కానీ జరగలేదు.
రైతులకు గోనె సంచులు ఇవ్వలేని అసమర్ద ప్రభుత్వం ఎందుకు?
ఈ సీఎం ఒక్క పొలం లో అయినా దిగాడా?ఈ సీఎం సిగ్గులేకుండా 5 ఏళ్ల క్రితం మేం చేసిన వాటికి మళ్లీ శంకుస్ధాపన చేస్తున్నారు.ఏలూరు చంద్రబాబు నాయుడు, కామెంట్స్.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.ఎక్కడ చూసినా ధాన్యం మొలకలు వచ్చింది.60 శాతానికి పైగా ధాన్యం పొలాల్లో ఉంది.ఇందుకు ఎవరు కారణం.
రైతుల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.దీనికి ఎవరు బాధ్యత వహించాలి.
వర్షాలు పడతాయి… అందుకు అవసరమైన సన్నద్ధత అవసరం.చేతకాని, దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నారు.
మీకు బాధ్యత లేదా… ఎందుకు రైతుల వద్దకు రారు.హుద్ హుద్ వస్తే అహర్నిశలు పనిచేశాను.
తూఫాన్ వస్తే జగన్ అటు వైపు చూడలేదు.పైగా అధికారంలో ఉండి నేనెందుకు వెళ్ళాలి అన్నాడు.
మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు.ఎందుకు ఇప్పుడు రైతులను పరామర్శించరు.
గతంలో ఎందుకూ పనికిరాని ధాన్యాన్ని కొని రైతులకు డబ్బులిచ్చాం.