గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.రాష్ట్ర ప్రజల్ని ఉగాది పండుగ చేసుకోనీయకుండా జగన్ రెడ్డి వారి జీవితాల్లో చీకట్లు నింపారు.
కొత్త సంవత్సరం రోజున ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాల్సిన తరుణంలో ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని జగన్ రెడ్డి కల్పించారు.కోతలు, వాతలతో జగన్ రెడ్డి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారు.
ఇంటింటికి కొవ్వొత్తి-అగ్గిపెట్టెలను పంపిణీ చేస్తాం.మళ్లీ గ్రామాల్లో లాంతర్లు, కిరోసిన్ బుడ్డీలు వెతుక్కునే పరిస్థతి వచ్చింది.
ఒక సామాన్యుడు ఇంట్లో ఫ్యాను వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు.జగన్ దెబ్బకు ఎలాగూ ఫ్యాన్లు కూడా వేసుకునే పరిస్థితి లేదు.
కరెంటు చార్జీల పెంపుతో బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారు.సోలార్ పవర్, విండ్ పవర్ ను నాశనం చేసావ్.
ఐదేళ్ల తెదేపా పాలనలో ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచలేదు ఒక్క గంట కరెంట్ తీయ్యలేదు.విద్యుత్ ఛార్జీల భారాలను మోపి సిగ్గులేకుండా సమర్ధించుకుంటున్నారు.విద్యుత్ ఛార్జీల పెంపును రద్దు చేసే వరకూ టీడీపీ పోరాటం చేస్తుంది.రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా 2వతేదీ ఉగాది నుంచి వారంరోజులపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో నిరసన చేపట్టాలని నిర్ణయించాం.
ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం గొంతు నొక్కే కార్యక్రమం చేయడం అత్యంత హేయమైన చర్య.ఇబ్రహీంపట్నం మండలం, తుమ్మలపాలెం గ్రామం కృష్ణానది ఒడ్డున కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.







