ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ క్యాంపెయిన్ ప్రారంభించింది.
వైసీపీ ప్రభుత్వం నిర్వహించనున్న ‘వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయినింగ్’ కు కౌంటర్ గా టీడీపీ ‘ ఏపీ హేట్స్ జగన్’ పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తుంది.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఏపీ హేట్స్ జగన్ హ్యాష్ ట్యాగ్ తో టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
ఈ క్రమంలోనే ఏపీ నీడ్స్ జగన్ కాదు.ఏపీ హేట్స్ జగన్ అంటూ టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
అయితే విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.







