వాలంటీర్ల ద్వారా జరిగిన వ్యక్తిగత సమాచార చౌర్యం వల్లే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో అమలు చేస్తున్న ఈ విధానం వల్ల ప్రజల ఆస్తులు, ధన, మాన ప్రాణాలకు రక్షణ లేదన్నారు.5.5 కోట్ల మందికి చెందిన డేటా దుర్వినియోగం వల్ల వైసీపీ బ్యాచ్ ఇప్పటికే రూ.50 వేల కోట్ల పేదల భూములు కాజేసిందని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజల గోప్యతకు ఎక్కడా రక్షణ లేదన్నారు.
వాలంటీర్ల ద్వారా పథకాల పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.వేలిముద్రల సేకరణ ద్వారా బ్యాంకు అకౌoట్లలో డబ్బులకు గ్యారెంటీ లేదన్నారు.
వ్యక్తిగత సమాచారం పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రైయివేటు వ్యక్తులు చేతుల్లో పెట్టటంపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ప్రశ్నిస్తే రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బోండా ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.