బాబుతో కలయిక.. తప్పదంటున్న " మోడీ-షా " !

గత ఎన్నికల ముందు టీడీపీ మరియు బీజేపీ మద్య మంచి సంబంధాలు ఉండేవి.కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయిందనే కారణంతో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించారు.

 Tdp Bjp Alliance Sure, Tdp Bjp , Amit Shah , Chandra Babu Naidu , Ap  Politics ,-TeluguStop.com

అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఓడిపోగా.కేంద్రంలో మళ్ళీ బీజేపీ ( BJP )అధికారంలోకి వచ్చింది.

ఇక అప్పటికే టీడీపీ బీజేపీ మద్య దూరం మరింత పెరగడంతో చంద్రబాబు కేంద్ర పెద్దలతో దూరంగానే ఉంటూ వచ్చారు.అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తప్పక గెలవాల్సిన పరిస్థితి.

అందువల్ల కేంద్రంతో వివాదం కన్నా సఖ్యత పెంచుకోవడమే మేలని భావించిన చంద్రబాబు.మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

Telugu Amit Shah, Ap, Chandrababu, Narendra Modi, Tdp Bjp-Politics

అయితే ఈసారి మాత్రం టీడీపీతో కలిసేందుకు కమలనాథులు ససేమిరా అంటున్నారు.ఒంటరిగానైనా పోటు చేస్తామే తప్ప టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.అయితే ఇప్పటికీ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన కూడా వైసీపీ విముక్త ఏపీ నినాదాన్ని గట్టిగా అలపిస్తోంది.జగన్ ను గద్దె దించాలంటే టీడీపీతో తప్పక కలవాల్సిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో బీజేపీతో తెరతెంపులు చేసుకుని టీడీపీతో కలవడానికి సిద్దం అని జనసేన పార్టీ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చింది.అదే గనుక జరిగితే బీజేపీకి ఏపీలో ఒంటరి పోరు తప్పదు.

అలా జరగకుండా ఉండాలంటే జనసేన ప్రతిపాధిస్తున్నట్లుగా బీజేపీ టీడీపీతో కలవాల్సిఉంటుంది.ఇప్పుడుల దీనిపైనే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారట బీజేపీ పెద్దలు.

Telugu Amit Shah, Ap, Chandrababu, Narendra Modi, Tdp Bjp-Politics

టీడీపీతో కలవడంపై ఇప్పటికే ఎన్నొ అంతర్గత చర్చలు జరిపిన బీజేపీ పెద్దలు చంద్రబాబుతో బేటీ అయ్యేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.నేడు బాబు డిల్లీ బయలుదేరనున్నారు.మోడీ( Narendra Modi ) మరియు అమిత్ షాతో ప్రస్తుత ఏపీ రాజకీయాలపై చర్చించనున్నారు.ఇక ఇదే బేటీలో టీడీపీతో పొత్తుపై కూడా బీజేపీ పెద్దలు ప్రస్తావించే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.

ఎన్నికలకు సరిగ్గా పది నెలలు మాత్రమే సమయం ఉండడంతో త్వరగా పొత్తులపై ఒక స్పష్టత తీసుకొని.కలిసి నడిచే విధంగా ప్రణాళికలు రచించే అవకాశం ఉంది.మరి నిన్నమొన్నటి వరకు టీడీపీతో కలవడానికి ఆసక్తి చూపని బీజేపీకి ఇప్పుడు కలవడం తప్పా వేరే ఆప్షన్ కనిపించడం లేదని విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube