త్వరలో జరగబోతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో తాము లేమని టీడీపీ ప్రకటించింది.వైసిపి మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తో ఆత్మకూరు ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.సెంటిమెంట్ తో జరగబోతున్న ఈ ఎన్నికల్లో సాంప్రదాయాన్ని పాటిస్తూ.
టిడిపి, జనసేన పార్టీలు పోటీకి దూరం అని ప్రకటించగా బిజెపి ఇక్కడ అభ్యర్థిని పోటీకి దింపుతుంది.దీంతో ఇక్కడ అధికార పార్టీ వైసిపి బీజేపీ మధ్య పోరు అనివార్యం అయింది.
అయితే ఇక్కడ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉండడం, ఆనవాయితీ ప్రకారం చూసుకుంటే సరైనదే అయినా, గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉంది.
అక్కడ టిడిపి ఓటుబ్యాంకు చాలావరకు బీజేపీకి బదిలీ అయింది .అయితే ఆత్మకూరు ఎన్నికల్లోనూ అదే విధంగా జరుగుతుందని టిడిపి అధిష్ఠానం అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి బిజెపి కి ఓటు బ్యాంకు బీజేపీ , మిగతా చిన్న చిన్న పార్టీలకు వెళ్ళినా సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం టిడిపికి ఓటు బ్యాంక్ తిరిగి వస్తుందని నమ్ముతోంది.
అయితే బీజేపీకి కాకుండా, అధికార పార్టీ వైసీపీకి ఈ ఓటు బ్యాంకు బదిలీ అయితే టిడిపి కి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మకూరులో పలానా పార్టీకి ఓటు వేయాలి అని ఓటర్లకు నేరుగా చెప్పే లేకపోవడంతో, టిడిపికి ఓటు ఎవరికి వెళ్తుందో క్లారిటీ లేదు.ఇక్కడ పోటీలో ఉన్న బిజెపి లేదా మిగతా చిన్న చిన్న పార్టీ లకు టిడిపికి ఓటు బ్యాంకు వెళ్లిన పర్వాలేదు.ఆ తర్వాత ఎన్నికల్లో మళ్లీ ఆ ఓట్లు వస్తాయి.
కానీ వైసీపీ వైపు మొగ్గు చూపితే రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.దీంతో టిడిపి ఇక్కడ పోటీకి అభ్యర్థి నింపకుండా తప్పు చేసిందనే అభిప్రాయం క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.