వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఢిల్లీ పీఠంపై మరొకసారి కూర్చోవాలని వ్యూహాల సిద్ధం చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనుకూలంగా మారిపోయాయి ….తాము ఎలాంటి శ్రమ పడకుండానే రెండు ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం పట్ల భాజపా పెద్దలు సంతోషపడుతూనే ఆచితూచి వ్యవహరిస్తున్నారట .
రాష్ట్ర రాజకీయాల వరకు బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీలు( TDP ) కేంద్రంలో బాజాపా కు మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం ఒకే తాటిపై నిలబడుతున్నాయి.ఈసారి కచ్చితంగా కేంద్రంలో మరొకసారి భాజపా అధికారంలోకి వస్తాదని సీట్ల సంఖ్య కాస్త అటు ఇటుగా ఉన్నా తమ రాజకీయ చాణిక్యంతో కమలనాథులు మరోసారి అదికారం లో కూర్చుంటారు అన్న అంచనాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాతో కలిసి ముందుకు నడవాలని రెండు పార్టీలు బలంగా నిర్ణయించుకున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.

ఇప్పటికే గత నెలలో జగన్ భాజపా పెద్దలను కలిసి సుదీర్ఘంగా చర్చించి వచ్చారు ,రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్నరాజకీయ పరిణామాలపై కేంద్రం తో చర్చించి మద్దత్తు విషయం లో కీలక మైన హామీను కేంద్ర పెద్దల నుంచి పొందా రనీ వైసిపి మీడియా వార్తలు రాస్తుండగా, ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు భాజపా పెద్దలను కలిసి వచ్చారు.భేటీ సుదీర్ఘంగా జరిగిందని, భవిష్యత్తు పొత్తులపై సమావేశంలో చర్చ చేశారని చంద్రబాబు నాయుడు ( Chandra babu naidu )పట్ల భాజపా పెద్దలు కూడా అనుకూలంగా ఉన్నారని, వారికి పది నుంచి 13 ఎంపీ సీట్లు కూడా చంద్రబాబు ఆఫర్ చేశారని చంద్రబాబు ఆఫర్కు అమిత్ షా వర్గం హ్యాపీగా ఫీల్ అయిందంటూ తెలుగుదేశం అనుకూల మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ భాజపా( BJP ) పార్టీకి ఏ రాష్ట్రంలోనూ లేని విచిత్ర రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎదురయ్యింది .తమ రాజకీయ అవసరాల కోసం పోటాపోటీగా మద్దతు ఇస్తున్న పార్టీలలో ఏది ఎంచుకోవాలో తెలియని సందిగ్థ త ఇప్పుడు అమిత్ షా వర్గం ఎదుర్కొంటుంది .మరి త్రాసు ఎటువైపు మొగ్గుతుందో మరికొన్ని రోజుల్లో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.