గుంటూరు జిల్లా తెనాలిలో ట్రోల్స్ వేధింపుల తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కేసు( Geethanjali )లో పురోగతి లభించింది.ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు టీడీపీ కార్యకర్త పసుమర్తి రాంబాబు( TDP Pasumarthi Rambabu )ను అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ సింగ్ నగర్ లో రాంబాబుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం వారిని విజయవాడ( Vijayawada ) నుంచి నిందితులను తెనాలికి తీసుకెళ్లారు.
గీతాంజలి కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా( Social Media ) పోస్టులు పెట్టడంపై విచారణ చేస్తున్నారు.
అయితే వైసీపీ ప్రభుత్వ పథకాలను పొగడిన నేపథ్యంలో తెనాలికి చెందిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.ఆ తరువాత ఆమె ఆత్మహత్యకు( Suicide ) పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.గీతాంజలి మృతిపై అధికార, విపక్ష పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోందని చెప్పుకోవచ్చు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు.అలాగే మరి కొందరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.